Peddireddy Ramachandrareddy : రిటర్న్ గిప్టు తరువాత ఇద్దువుగానీ ముందు కుప్పంలో గెలిచి చూపించు : మంత్రి పెద్దిరెడ్డి

జగన్ కు రిటర్న్ గిప్టు తప్పకుండా ఇస్తా..పక్కాగా ఇస్తా అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి మండిపడ్డారు.

peddireddy ramachandrareddy

Nara Lokesh..peddireddy ramachandrareddy : జగన్ కు రిటర్న్ గిప్టు తప్పకుండా ఇస్తా..పక్కాగా ఇస్తా అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయటమే కాకుండా తాను తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించాక తనను కూడా అరెస్ట్ చేయించేందుకు జగన్ కుట్ర చేస్తున్నాడని..వేయని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనను ఇరికించే కుట్రలు చేస్తున్నారని ఆ కేసులో తనను A14గా చేర్చారు అంటూ మండిపడ్డారు. ఢిల్లీలోనే ఉన్న లోకేశ్ ఢిల్లీ వచ్చి తనను అరెస్ట్ చేసే దమ్ములేదు అంటూ ఎద్దేవా చేశారు.

జగన్ కు రిటర్న్ గిప్టు తప్పకుండా ఇస్తా..పక్కాగా ఇస్తా అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి (peddireddy ramachandrareddy) మండిపడ్డారు. రిటర్న్ గిప్టు తరువాత ఇద్దువుగానీ ముందు నువ్వు కుప్పంలో పోటీ చేసి గెలిచి చూపించు రిటర్న్ గిఫ్ట్ విషయం తరువాత చూద్దాం అంటూ ఎద్దేవా చేశారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చేయించారని ఆరోపించారు. అక్రమ కేసులతో ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రలు చేస్తున్నారంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి స్పందిస్తు తమకు ఎవరిమీద కక్ష సాధింపులు లేవన్నారు. పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అంటూ సూచించారు.

Nara bhuvaneswari : చంద్రబాబు విడుదల కోసం చర్చిలో భువనేశ్వరి ప్రార్ధనలు

కాగా తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చేయించారని ఆరోపించారు. అక్రమ కేసులతో ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. యువగళం పాదయాత్ర మళ్లీ మొదలు పెడతామని చెప్పినందుకే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నన్ను ఏ-14గా చేర్చారని లోకేశ్ ధ్వజమెత్తారు. 6 నెలల్లో జగన్ కు రిటర్న్ గిఫ్ట్ పక్కా ఇస్తామని నారా లోకేశ్ హాట్ కామెంట్స్ చేశారు.

వేయని రింగ్ రోడ్డు కేసులో తనను ఏ-14గా చేర్చారని లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దీంట్లో భాగంగా వైసీసీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతు..ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ పాత్ర ఉందని అన్నారు. అవినీతి జరిగింది కాబట్టే సీఐడీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్ కోర్టుల విషయంలో ఎందుకు భయపడుతున్నారు…? అవినీతి చేయకపోతే భయం ఎందుకు..? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 వైసీపీ గెలుస్తుంది అంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

Chandrababu Quash Petition : సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు, విచారణ చేసే బెంచ్ ఇదే.. ఊరట లభిస్తుందా?