ఎవర్నీ వదలం.. మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు

ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కచ్చింగా విచారణ జరుగుతుందని, ఎవర్నీ వదలిపెట్టమని హెచ్చరించారు.

Health Minister Sathya Kumar : ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో భారీగా అవకతవకలు జరిగాయని అన్నారు. తమ వర్గీయులకు సంబంధించిన ఆసుపత్రులకు నిధులు దోచి పెట్టారని, ఇప్పటికే 1500కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయని మంత్రి తెలిపారు.

Also Read : చంద్రబాబు పోలవరం సందర్శనపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

15వ ఆర్థిక సంఘం, కేంద్రం నుంచి వచ్చిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. దీనిపై కచ్చింగా విచారణ జరుగుతుందని, ఎవర్నీ వదలిపెట్టమని హెచ్చరించారు. మెడికల్ కాలేజీల విషయంలో కూడా ఇష్టారీతిన వ్యవహించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ పరిగణలోకి తీసుకోలేదు. కేంద్రం మంజూరు చేసిన 17మెడికల్ కళాశాలలు పునాదులు కూడా దాటలేదని తెలిపారు. మొత్తం వీటిన్నింటిని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ తెలిపారు.

 

 

ట్రెండింగ్ వార్తలు