చంద్రబాబు పోలవరం సందర్శనపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

రెండు కాపర్ డ్యాంలు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయా ఫ్రం వాల్ నిర్మించాలి.. అలా చెయ్యలేదు. నది డైవర్షన్ చెయ్యకుండా డయా ఫ్రం వాల్ కట్టేశారు.. వరదలకు

చంద్రబాబు పోలవరం సందర్శనపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

Ambati Rambabu

Ambati Rambabu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు సందర్శనపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరంపై చంద్రబాబు వ్యాక్యలు పచ్చి అబద్ధాలని అన్నారు. పోలవరం విషయంలో దుర్మార్గంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, జగన్ మోహన్ రెడ్డి కారణంగానే పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలోకి నెట్టివేయబడిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తప్పిదం వల్లనే పోలవరంకు నేడు ఈ దుస్థితి తలెత్తిందని అంబటి విమర్శించారు.

Also Read : పవన్ కల్యాణ్ ఓకేఅంటే అదే క్యాంపు కార్యాలయం.. గతంలో దేవినేని, బొత్స..

గతంలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును 2019లో పూర్తి చేస్తామని చెప్పారు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2022లో ప్రాజెక్టును పూర్తి చేయాలని టార్గెట్ గా పనిచేశామని అంబటి రాంబాబు తెలిపారు. జరిగిన పరిణామాలు, వాస్తవ పరిస్థితుల దృష్ట్యా ప్రాజెక్టు పూర్తికి సమయం పడుతుందని చెప్పామని అంబటి గుర్తు చేశారు. చంద్రబాబు చేసిన ప్రధాన తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలో పడిందని విమర్శించారు.

Also Read : ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

రెండు కాపర్ డ్యాంలు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయా ఫ్రం వాల్ నిర్మించాలి.. అలా చెయ్యలేదు. నది డైవర్షన్ చెయ్యకుండా డయా ఫ్రం వాల్ కట్టేశారు.. వరదలకు కొట్టుకుపోయిందని అంబటి చెప్పారు. ఇరిగేషన్ పై అవగాహన ఉన్న మేధవులంతా చంద్రబాబు చేసిన తప్పుని గ్రహించారు. పోలవరం ప్రాజెక్టు అంత సులువుగా అర్థం కాదు. ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి కాదని నేను ముందే చెప్పాను. కానీ, చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం వెళ్లి మాపై బురద జల్లాలని చూస్తున్నాడని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంలో మా ప్రభుత్వం చేసిన తప్పు లేదు.. ముమ్మాటికీ చంద్రబాబు తప్పిదమేనని అన్నారు.

కేంద్రంలో మన అవసరం ఉంటే హోదాతోపాటు నిధులు తెచ్చుకోవచ్చున‌ని జగన్ మోహ‌న్ రెడ్డి అనుకున్నారు. అలాంటి మంచి అవకాశం చంద్రబాబుకి వచ్చిందని అంబ‌టి రాంబాబు అన్నారు. ఇప్పుడు ఎలాంటి ధర్మ పోరాటాలు అవసరం లేకుండా సాధించవచ్చు. జ‌గన్ పై బురద జల్లడం మానేసి రాష్ట్రానికి ఇవన్నీ తీసుకుని రండి. ఈవీఎంల‌పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఈవీఎంలపై ఉన్న అనుమానాలపై చర్చ జరగాలని అంబ‌టి రాంబాబు అన్నారు.