Corona Patients Missing : చిత్తూరు జిల్లాలో 1500 మంది కరోనా రోగుల మిస్సింగ్

చిత్తూరు జిల్లాలో కరోనా రోగుల మిస్సింగ్ కలకలంగా మారింది. మొత్తం 15వందల కరోనా రోగులు కనిపించడం లేదు.

Corona Patients Missing : చిత్తూరు జిల్లాలో 1500 మంది కరోనా రోగుల మిస్సింగ్

Corona Patients Missing

Updated On : April 28, 2021 / 2:38 PM IST

corona patients in Chittoor : చిత్తూరు జిల్లాలో కరోనా రోగుల మిస్సింగ్ కలకలంగా మారింది. మొత్తం 15వందల కరోనా రోగులు కనిపించడం లేదు. రెండు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 9వేల164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే వారిలో 7వేల270 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. మిగిలిన వెయ్యీ49 మంది రోగుల ఆచూకీ తెలియడం లేదు.

కరోనా టెస్టుల సమయంలో ఇచ్చిన అడ్రస్‌లో వారు లేరు. ఫోన్‌ నంబర్లూ పనిచేయడం లేదు. దీంతో కరోనా రోగుల కోసం అధికారులు వెతుకుతున్నారు. మరో 845 మంది రోగులు తిరుపతి వదిలి వెళ్లిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు.

కరోనా శాంపిల్స్ ఇచ్చే సమయంలో బాధితులు ఫోన్ నంబర్లు, చిరునామాలు తప్పుగా ఇస్తున్నారు. ఫలితాలు రాకముందే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.

ఇలాంటి వారి వల్లే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని అధికారులు భావిస్తున్నారు. మిస్సింగ్ అయినవారిని పట్టుకునేందుకు అధికారుల ప్రయత్నాలు చేస్తున్నారు.