Ambati Rambabu: ప్రజా సమస్యలు చర్చించే శాసనసభ ఒక పవిత్రమైన దేవాలయం: ఎమ్యెల్యే అంబటి రాంబాబు

ప్రజా సమస్యలు చర్చించే పవిత్ర దేవాలయమైన శాసనసభలో ప్రతిపక్షాలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయని అంబటి రాంబాబు మండిపడ్డారు.

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష టీడీపీ నేతలు అనుసరిస్తున్న విధానంపై సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు చర్చించే పవిత్ర దేవాలయమైన శాసనసభలో ప్రతిపక్షాలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయని అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడారు. గత రెండేళ్లుగా శాసనసభ సమావేశాలు సరిగా జరుగడం లేదని ఆయన అన్నారు. ప్రతిపక్ష నేతల తీరుతో ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు మొదటి రోజు నుంచి పూర్తి విరుద్దంగా జరుగుతున్నాయని అంబటి రాంబాబు అసహనం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ అసాధారణంగా వ్యవహరిస్తోందని, ప్రతిపక్షాలు వేసిన ప్రశ్నలకు కూడా జవాబు చెప్పనీయరని మండిపడ్డారు.

Also read: Minister KTR : రూ.46 వేల కోట్లతో ఇంటింటికీ మంచినీరు ఇస్తున్నాం : మంత్రి కేటీఆర్

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇటీవల జరిగిన కల్తీ సారా వ్యవహారాన్ని టీడీపీ నేతలు ప్రభుత్వానికి ఆపాదించాలని చూస్తున్నారని, ఆ వ్యవహారంలో ఇప్పటికే కేసులు కూడా నమోదు అయినట్లు ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబు సిఎంగా వున్నప్పుడు సారాపై ఎన్ని దాడులు చేశారో ఆ లెక్కలన్నీ మావద్ద వున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో సారాను అరికట్టడానికి ప్రత్యేక వ్యవస్థనే పెట్టామన్న అంబటి..అసలు తమ ప్రభుత్వ ద్యేయమే మద్యాన్ని నిషేదించడమని తెలిపారు.

Also read: Etela Rajender : అందుకే దీక్ష చేపట్టాం – ఈటల రాజేందర్

జంగారెడ్డి గూడెంలో సంభవించిన సహజ మరణాలను..ప్రజలు నమ్ముతారని శాసనసభను ఉపయోగించుకొనే దుస్థికి టీడీపీ దిగజారిందని అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సభకు రారని.. వచ్చిన టీడీపీ సభ్యులు సభను అడ్డుకుంటున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యాళతం చేశారు. సభను అడ్డుకుంటే సస్పెండ్ చేయడం మామూలే అయితే.. వచ్చినవారు గొడవ చేసి బయటకు వచ్చి వీరంగం సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు