MLA Ganta Srinivas Interesting comments on former CM YS Jagan
Ganta Srinivasa Rrao: కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని శుభవార్తలే అందుతున్నాయని మాజీ మంత్రి, బీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. విశాఖ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ రెండు లక్షల కోట్లతో శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. తాజాగా.. స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం చాలా ఆనందకరమైన విషయం అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడంతోపాటు.. నిధులు సాధించడంలో కూటమి ప్రభుత్వం విజయవంతం అయిందని గంటా ఆనందం వ్యక్తం చేశారు.
Also Read: KCR survey report : కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది.?
స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం కోసం మేము ఎంతవరకైనా వెళ్తాం..గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దంటూ నేను రాజీనామా కూడా చూశానని గంటా గుర్తుచేశారు. ఆ రాజీనామాకి ఈరోజు సార్ధకత చేకూరిందని అన్నారు. కేంద్రం తాజా నిర్ణయంతో కార్మికులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని గంటా శ్రీనివాస్ రావు తెలిపారు.
Also Read: China Population: చైనాను వీడని టెన్షన్.. వరుసగా మూడో ఏడాదీ భారీగా తగ్గిన ఆ దేశ జనాభా
జగన్ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండటానికి ఎటువంటి ప్రయత్నాలు చెయ్యలేదని గంటా విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి హోదాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన ప్రతిసారి ఆయన కేసుల కోసం మాట్లాడేవాడు తప్ప రాష్ట్ర అభివృద్ధికోసం ఎప్పుడూ మాట్లాడింది లేదని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ప్రధానమంత్రి మోదీని కలిసినప్పుడల్లా రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడారని, నిధులు తెస్తున్నారని కొనియాడారు. జగన్ ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రం అప్పులు పాలైతే.. చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం హయాంలో ఏడు నెలల పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని గంటా శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.