Grandhi Srinivas
Grandhi Srinivas – Pawan Kalyan : జగనన్న సురక్ష కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగుతుందని.. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మేల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. పరిపాలన పట్ల పేదలకు నమ్మకం కల్పించిన నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి పారదర్శక పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
నాడు పార్టీ జండా పట్టుకుంటే పథకాలు ఇచ్చేవారు.. నేడు శ్యాచురేషన్ పద్ధతిలో పాలన సాగుతుందని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెత్తందారులే కావాలన్నారు. రామోజీరావు, సుజనా చౌదరి, విద్య పేరుతో పేదల రక్తాన్ని తాగిన నారాయణ లాంటి వారు వీరికి కావాలని ఆరోపించారు. అలాగే అమరావతిలో భూములు ఉన్న మురళీ మోహన్ లాంటి వారు వారికి కావాలని విమర్శించారు.
Chandrababu : టీడీపీలో చేరిన వైసీపీ నేత పరుచూరి సుభాష్ చంద్రబోస్
పెత్తందారులను కాపాడేందుకే టీడీపీ ఉందని ఆరోపించారు. గుడి దగ్గర చెప్పులు పోయాయని పవన్ కళ్యాణ్ అంటున్నాడని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజి స్టార్ అని ఎద్దేవా చేశారు. ప్యాకేజి కోసం వెళ్లినప్పుడు పవన్ కళ్యాణ్ తన చెప్పులను చంద్రబాబు గుమ్మం ముందు వదిలి వచ్చాడని పేర్కొన్నారు. పవన కళ్యాణ్ చెప్పులు.. చంద్రబాబు ఇంటి గుమ్మం ముందు ఉన్నాయని, జనసైనికులు వాటిని చూసి రావాలని సూచించారు.
చదువు అబ్బని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. పవన్ కు 55 ఏళ్లు వచ్చినా.. ఎల్ కేజీలో చేర్చేలా జీవో ఇప్పించాలని కోరుతున్నామని తెలిపారు. వారాహి యాత్రలో పవన్ ను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ అంటే విశ్వాసం ఉండాలన్నారు. “30 సీట్లు రాని నాకు సీఎం పదవి ఎవరిస్తారు అంటావు.. కాసేపు నేను ఒంటరిగా వెళ్లాలా, పొత్తులో వెళ్లాలా అంటావు” అని ఎద్దేవా చేశారు.
ఒకప్పుడు తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినేనని తెలిపారు. “ప్రజారాజ్యంను కాంగ్రెస్ లో విలీనం చేశారు మీ అన్న, టీడీపీలో జనసేన విలీనం కాకున్నా సహా జీవనం చేస్తున్నారు” అని పేర్కొన్నారు. “పొట్టి శ్రీరాములు ఏపీ కోసం పోరాడినప్పుడు మీరు ఎక్కడున్నారో తెలుసా సార్.. మద్రాస్ లో ఉన్నారు సార్” అని పవన్ ను ఉద్దేశించి మాట్లాడారు.
అభిమానులు, ప్రజాస్వామ్య వాదులను మోసం చేయాలని చంద్రబాబు దగ్గర నేర్చు కున్నావా అని ప్రశ్నించారు. “మీ అభిమానిగా చేతులు జోడించి అడుగుతున్నా.. మిమ్మల్ని మీరు ప్రశ్నించు కోండి సార్” అని అన్నారు. వాళ్లు యువత.. వారి కుటుంబాలకు వారే ఆధారం సార్.. వారి భవిష్యత్ ఎందుకు పాడు చేస్తున్నారు సార్ అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై తిరగబడండి, మిలిటెంట్లుగా మారండి అంటూ రెచ్చ గొడుతున్నారని పేర్కొన్నారు.
Vijayashanti : ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో బీజేపీ అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకోవాలి : విజయశాంతి
పిల్లల భవిష్యత్తు కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి తపన పడుతుంటే ఆయనపై విమర్శలు చేయడం పవన్ కళ్యాన్ కు సబబు కాదని అభిప్రాయపడ్డారు. పవన్ కు ఓట్లు వేయడం లేదనీ ఆయనకు ఓట్లు వేసిన వారినే అవమానిస్తున్నాడని పేర్కొన్నారు. దమ్ము ఉంటే పవన్ కళ్యాణ్ కూడా పాదయాత్ర చేయాలన్నారు. జ్వరం పేరుతో డబ్బింగులు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కస్తూర్బా కాలేజీ తరలి పోతుంటే రూ.3కోట్లు విలువ చేసే తమ సొంత స్థలం ఇచ్చామని వెల్లడించారు.
భీమవరం ప్రజలు పవన్ చెబితే తెలుసుకునే పరిస్థితి లేరని పేర్కొన్నారు. భీమవరంలో ఎన్ని వార్డులు, ఎన్ని మండలాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ కు తెలియదని.. పవన్ హైదరాబాద్ వాసి అని పేర్కొన్నారు. వెన్నుపోట్లకు పేటెంట్ నాదెండ్ల మనోహర్ ఫ్యామిలీ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కోవర్ట్ నాదెండ్ల మనోహర్ అని జనసైనికులే అంటున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో వ్యాపారాలు చేస్తూ కుంభకోణాలు చేసినవారు పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నారని ఆరోపించారు. ఇక్కడ ప్రజలు ఎవ్వరూ చెవిలో పూలు పెట్టుకోలేదని తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అసలు కాంపిటీటర్ కాదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కార్యక్తలను కలవాలంటే సైతం ప్యాకేజీనే, వారి ప్రజా ప్రతినిధులను సైతం కలవాలంటే ప్యాకేజీనే అని ఆరోపించారు.