Chandrababu : టీడీపీలో చేరిన వైసీపీ నేత పరుచూరి సుభాష్ చంద్రబోస్

ఆంధ్రప్రదేశ్ లో నేతలు పార్టీ మార్పులపై దూకుడు పెంచుతున్నారు. అవనిగడ్డకు చెందిన వైసీపీ నేత పరుచూరి సుభాష్ చంద్రబోస్ చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు.

Chandrababu : టీడీపీలో చేరిన వైసీపీ నేత పరుచూరి సుభాష్ చంద్రబోస్

Paruchuri Subhash Chandra Bose joined TDP

Updated On : June 30, 2023 / 2:08 PM IST

chandrababu..Paruchuri Subhash Chandra Bose : ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో నేతలు పార్టీ మార్పులపై దూకుడు పెంచుతున్నారు. దీంట్లో భాగంగా అవనిగడ్డకు చెందిన వైసీపీ నేత పరుచూరి సుభాష్ చంద్రబోస్ (Paruchuri Subhash Chandra Bose) చంద్రబాబు (chandrababu)సమక్షంలో టిడిపి (TDP)లో చేరారు.అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న సుభాష్ చంద్రబోస్ తో పాటు వైసీపీ నేతలు,కార్యకర్తలు టీడీపీలో చేరారు. దీంతో అవనిగడ్డ నియోజకవర్గంలో జోష్ మరింతగా పెరిగింది. సుభాష్ చంద్రబోస్ టీడీపీలో చేరిన కార్యక్రమంలో అవనిగడ్డ టీడీపీ ఇంచార్జ్ (Avanigadda TDP charge)మండలి బుద్ధ ప్రసాద్ (Mandali Buddha Prasad) పాల్గొన్నారు.

సుభాష్ చంద్రబోస్ పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు..జగన్మోహన్ రెడ్డి ముందు బకాసురుడు కూడా తక్కువేనని..చరిత్రలో ఉన్న రాక్షసులందరినీ మించిన రాక్షసుడు జగన్ అంటూ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ప్రపంచంలో ఉండే వింత జంతువుల కంటే వింత జంతువు జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శించారు. మనం మారకపోతే జీవితాలు మారవనే వాస్తవం గ్రహించిన వైసిపి నేతలు తెలుగుదేశం వైపు మొగ్గుచూపుతున్నారుని అన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వైసిపి ఓడితే రాష్ట్రం గెలిచినట్లు అని నేను చెబుతున్నానని వెల్లడించారు.

TDP : ఆయన మారని పార్టీ లేదు, నా గురించి నీకు పూర్తిగా తెలీదు.. బొజ్జల సుధీర్, ఎస్సీవీ నాయుడు ఒకరిపై మరొకరు కౌంటర్లు

రాష్ట్రం గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ మారాలని..గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరూ కష్టపడాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు సూచించారు. గొడవలు అంటే తెలియని ప్రశాంత నగరంగా ఉండే విశాఖలో ఇప్పుడెవరైనా అడుగుపెట్టాలంటే భయపడుతున్నారని వైసీపీ పాలనలో అటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అంటూ మండిపడ్డారు. ప్రారంభానికి ముందే పోలవరాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టారంటూ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో పడిన 5ఏళ్ల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు మాదిరి చేశారు అంటూ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు చంద్రబాబు.