Kakani Govardhan : సత్యా నాదెండ్ల సీఈఓగా ఎదగడానికి టీడీపీయే కారణమని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటు.. : మంత్రి కాకాని

చంద్రబాబుకు మతి భ్రమించినది.ఆయన చేసిన ప్రసంగాలు చూస్తే అర్థమవుతుంది.కుప్పం, టెక్కలిలో ఇంటింటికి తిరుగుదాం. ఎవరి హయాంలో ఎక్కువ లబ్ది జరిగిందో చూద్దాం అంటూ సవాల్ విసిరారు.

Kakani Govardhan : సత్యా నాదెండ్ల సీఈఓగా ఎదగడానికి టీడీపీయే కారణమని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటు.. : మంత్రి కాకాని

Kakani Govardhan..Chandrababu

Updated On : June 30, 2023 / 1:39 PM IST

Kakani Govardhan..Chandrababu : మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి కాకాని మాట్లాడుతు.. క్షేత్ర స్థాయిలో ఉన్న చిన్నపాటి సమస్యలు పరిష్కరిం చేందుకు రేపటి నుంచి జగనన్న సురక్షను ప్రారంభిస్తామని దీనిని ప్రజలు ఇబ్బందులు తొలగించేందుకు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి చంద్రబాబు జీవితం అబద్దాల మయం అంటూ విరుచుకుపడ్డారు. సత్యా నాదెండ్ల సీఈఓగా ఎదగడానికి టిడిపినే కారణమని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటన్నారు.

1992లో మైక్రో సాప్ట్ లో నాదెండ్ల చేరే సమయానికి చంద్రబాబు ముఖ్య మంత్రి కూడా కాలేదని..చంద్రబాబు సీఎం కాక ముందే సత్య నాదెళ్ల మైక్రో సాప్ట్ లో జాబ్ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు.సత్య నాదెళ్ల విషయంలో కూడా చంద్రబాబు అబద్ధాలు చెప్పి.. లబ్ది పొందాలని చూస్తున్నారు అంటూ విమర్శించారు.చంద్రబాబుకు మతి భ్రమించినదని ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ప్రసంగాలు చూస్తే అర్థమవుతుంది అంటూ చంద్రబాబు గతంలో మాట్లాడిన వీడియోలను మంత్రి కాకాని ప్రదర్శించారు.

YSRCP : అధికార వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి సీఎం జగన్ ముఖ్య అనుచరుడు

నిసిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు చెబుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని టీడీపీ లాగా మేం మేనిఫెస్టో ను దాచి పెట్టలేదన్నారు. అర్హత కల్గిన ప్రతి ఒక్కరికీ మా మేనిఫెస్టో ద్వారా పథకాలు అందిస్తున్నామని తెలిపారు.ఎవరి హయాంలో ప్రజలకు ఎక్కువ లబ్ది జరిగిందన్న దానిపై అచ్చెన్నాయుడు, చంద్రబాబుకు మంత్రి సవాల్ విసిరారు.వారిద్దరికీ చీము, నెత్తురు ఉంటే నేను విసిరిన సవాల్ ను స్వీకరించే దమ్ము ఉందా? అంటూ ప్రశ్నించారు.కుప్పం, టెక్కలిలో ఇంటింటికి తిరుగుదామని.. ఎవరి హయాంలో ఎక్కువ లబ్ది జరిగిందో చూద్దాం అంటూ సవాల్ విసిరారు.

ఇదే సందర్భంగా మంత్రి లోకేశ్ పై కూడా విమర్శలు చేస్తు..లోకేష్ సెల్ఫీలు తీసుకుని విమర్శలు చేసిన దానిపై చర్చకు వచ్చే దమ్ము ఉందా అంటూ సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ జిల్లా నుంచి బయటికి వెళ్లే లోపు సమాధానం చెబుతారా? అంటూ ప్రశ్నించారు. లోకేశ్ షో అట్టర్ ప్లాప్ కావడంతో ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆరోపించారు.
పాదయాత్రకు స్పందన లేకే కొన్ని గ్రామాలకు లోకేష్ వెళ్ళడం లేదని అన్నారు మంత్రి కాకాని.

TDP : ఆయన మారని పార్టీ లేదు, నా గురించి నీకు పూర్తిగా తెలీదు.. బొజ్జల సుధీర్, ఎస్సీవీ నాయుడు ఒకరిపై మరొకరు కౌంటర్లు