Kethireddy Venkatarami Reddy : టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం అగ్రకులాలకు తప్ప బీసీ కులాలకు మంత్రి పదవులు ఇచ్చారా? ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

రాష్ట్రంలో గత 20 ఏళ్ల కాలంలో దళితులకు హోం మంత్రి పదవి ఇచ్చిన ఘనత సీఎం జగన్ దేనని వెల్లడించారు. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న జగన్ ను వచ్చే ఎన్నికల్లో అండగా నిలుద్దామన్నారు.

Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy – Chandrababu : అనంతపురంలో బడుగు, బలహీన వర్గాలకు ఎంపీ సీట్లు పేటెంట్ లా మారిపోయాయని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం అగ్రకులాలకు తప్ప వెనుకబడిన బీసీ కులాలకు మంత్రి పదవులు ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకి ఎంతసేపు పయ్యావుల, పరిటాల, జేసి బ్రదర్స్ కనబడుతారు తప్ప పార్థసారధి లాంటి బీసీ నేతలు కనపడరని విమర్శించారు.

చంద్రబాబు జైలుకెళ్ళినప్పటి నుంచి వనభోజనాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. అనంతపురంలో ర్యాలీ జరిగినా, హైదరాబాదులో మీటింగ్ జరిగినా కమ్మ కులం వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు అందులో పాల్గొనలేదన్నారు. టీడీపీ కమ్మల పార్టీ, వైఎస్ఆర్సీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పార్టీ అని పేర్కొన్నారు.

Janasena : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం.. ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఆరు అంశాలు ప్రతిపాదించిన జనసేన

‘నేను మీకు మంచి చేసి ఉంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పే దమ్మున్న నాయకుడు దేశ రాజకీయాల్లో ఒక్క జగన్ తప్ప ఎవరూ లేరు’ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత 20 ఏళ్ల కాలంలో దళితులకు హోం మంత్రి పదవి ఇచ్చిన ఘనత సీఎం జగన్ దేనని వెల్లడించారు. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న జగన్ ను వచ్చే ఎన్నికల్లో అండగా నిలుద్దామన్నారు.