MLA Rajasingh : తిరుపతి శ్రీవారి పార్వేట మండపం కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే రాజాసింగ్

టీటీడీ కేవలం ఆంధ్ర ప్రజలది మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అందరి హిందువులది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

MLA Rajasingh : తిరుపతి శ్రీవారి పార్వేట మండపం కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే రాజాసింగ్

MLA Rajasingh

Updated On : July 11, 2023 / 10:17 AM IST

Tirupati Parveta Mandapam Demolition : తిరుపతిలోని శ్రీవారి పార్వేట మండపం కూల్చివేత వివాదంగా మారుతోంది. పార్వేట మండపం కూల్చివేతపై హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. 350 ఏళ్ల నాటి మండపాన్ని ఏ విధంగా కూలుస్తారని ప్రశ్నించారు. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో నిర్మించిన పార్వేట మండపం కూల్చివేత హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని హితవుపలికారు. టీటీడీ కేవలం ఆంధ్ర ప్రజలది మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అందరి హిందువులది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

Parvathipuram Politics : హీటెక్కిన పార్వతీపురం రాజకీయం.. బొబ్బిలి చిరంజీవులు, జోగారావు పరస్పర ఆరోపణలు

ఇక్కడ ఏం చేసినా చెల్లుతుందని అనుకోవడం సరైంది కాదన్నారు. పార్వేట మండపం కూల్చివేతకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నట్లు రాజాసింగ్ పేర్కొన్నారు.