ఏపీ సీడ్స్‌పై ఎమ్మెల్యే ఆర్కే ఆగ్రహం.. నకిలీ విత్తనాలతో 25% పంట నష్టం

ఏపీ సీడ్స్‌పై ఎమ్మెల్యే ఆర్కే ఆగ్రహం.. నకిలీ విత్తనాలతో 25% పంట నష్టం

Updated On : October 26, 2020 / 6:02 PM IST

AP seeds కంపెనీపై అసంతృప్తి వ్యక్తం చేశారు మంగళగిరి రామకృష్ణ. 5 ఎకరాల్లో వేసిన పంటలో 20 నుంచి 25శాతం నాసిరకం పంట వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. నాసిరకం విత్తనాల పంపిణీ చేసిన మంజీరా కంపెనీపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

వ్యవసాయానికి సీఎం జగన్ పెద్ద పీట వేస్తుంటే మంజీరా అనే కంపెనీ నాసిరకం విత్తనాలు సప్లై చేయడం సరికాదని అన్నారు. చట్ట ప్రకారం.. మంజీరా కంపెనీపై చర్యలు తీసుకోవాలంటున్న ఆర్కే డిమాండ్ చేస్తున్నారు.



14ఎకరాలు వరిపంట సాగు చేశాను. మా వైపు కేళీ(బెరకు) విత్తనాలు కనిపించాయి. అవి తెలిసిన వెంటనే ఏపీ సీడ్స్ డీఎంకు తెలియజేశాను. దాని బ్యాచ్ నెంబర్, సంచితో సహా వారికి తెలియజేశాను. వారు పొలానికి వచ్చి పరీక్షలు చేశారు.

కేళీలు ఉన్నా కూడా 0.2శాతానికి మించి ఉండకూడదని వారు అన్నారు. కానీ 25శాతం వరకూ కనిపించడం వాళ్లు కూడా ఆశ్చర్యంగా అనిపించింది. ఏపీ సీడ్స్ రకరకాల కంపెనీల నుంచి సరఫరా చేస్తుంటారు. ఈ సంచులు ఏ బ్యాచ్ లో వచ్చింది. ఏ సంచుల్లో వచ్చిందని కనుక్కొని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రభుత్వం చాలా సీరియస్ గా పనిచేస్తున్నప్పుడు ఇటువంటి తప్పులు ఎక్కడ జరుగుతున్నాయనే దానిపై ఫోకస్ పెట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.