ఎనీ సెంటర్, ఎనీ ఎలక్షన్, జగన్ సింగిల్ హ్యాండ్.. MLA Roja పంచ్ డైలాగ్‌లు

కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ ఘన విజయంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. సినిమా స్టైల్ లో పంచ్‌ డైలాగులు పేల్చారు. వైసీపీ అభ్యర్థిని గెలిపించిన

Mla Roja

MLA Roja : కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ ఘన విజయంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. సినిమా స్టైల్ లో పంచ్‌ డైలాగులు పేల్చారు. వైసీపీ అభ్యర్థిని గెలిపించిన బద్వేలు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, పాదాభివందనాలు అంటూ ఓ వీడియో సందేశం అందించారు రోజా.

“జగనన్నపై అభిమానంతో 2019లో 45 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిపిస్తే, నేడు జగనన్న పాలన చూసి 90 వేలకు పైగా మెజారిటీ అందించారు. జగనన్న సుపరిపాలనకు ప్రజలందరూ మద్దతు పలుకుతున్నారన్న విషయం స్పష్టమైంది.

Diabetes : షుగర్ వ్యాధి గ్రస్తులు తీపిపదార్ధాలు తింటే ప్రమాదమా?..

ఇవాళ చంద్రబాబుకి సూటిగా చెబుతున్నాం. కుప్పంలో నీ వాగుడు చూశాం, నీ డ్రామాలు చూశాం. ఇప్పటికైనా తెలిసిందా… ఏ సెంటర్ లో అయినా, ఏ టైమ్ లో అయినా, ఏ ఎలక్షన్ లో అయినా జగన్ గారు సింగిల్ హ్యాండ్ తో అన్ని పార్టీలను మట్టి కరిపిస్తారు. బద్వేలులో పోటీ చేయబోమని చెప్పిన మీరు, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ తో కలిసి మూకుమ్మడిగా మమ్మల్ని దొంగదెబ్బ తీయాలని చూశారు. కానీ బద్వేలు ప్రజలు మిమ్మల్నందరినీ చితకబాది తరిమికొట్టారంటే జగనన్న పవరేంటో అర్థమైందా? మీకు ఎమ్మెల్యే సీటు కాదు కదా… మిమ్మల్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని బద్వేలు ప్రజలు నేడు 90 వేల మెజారిటీతో సుధమ్మను ఆశీర్వదించి శాసనసభకు పంపించారు.

WhatsApp Cashback: వాట్సాప్‌ పేమెంట్స్‌తో క్యాష్‌బ్యాక్‌.. ఇలా ట్రై చేయండి!

జగన్ గారిది ఒకే జెండా, ఒకటే అజెండా. దాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఆమోదించారు. ఈ సందర్భంగా జగనన్నకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. 2024 ఎన్నికల్లో అన్ని సీట్లు వైసీపీనే గెలవాలని, టీడీపీకి ఒకట్రెండు స్థానాలు కూడా దక్కకూడదని కోరుకుంటున్నా” అంటూ రోజా తన వీడియోలో చెప్పారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం పట్ల రోజా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థి సుధకు ఆమె అభినందనలు తెలిపారు.