Andhra Pradesh : ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి రిమాండ్ పొడిగించిన కోర్టు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి కోర్టు మరోసారి రిమాండ్ ను పొడిగించింది.

Andhra Pradesh : ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి రిమాండ్ పొడిగించిన కోర్టు

mlc anantha babu fjudicial remand extended

Updated On : September 23, 2022 / 2:40 PM IST

Andhra Pradesh : డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి కోర్టు మరోసారి రిమాండ్ ను పొడిగించింది. ఇంతకుమందు విధించిన రిమాండ్ గడువు శుక్రవారం (సెప్టెంబర్ 23,2022)తో పూర్తి కావడంతో పోలీసులు ఆయనను రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో అనంతబాబు రిమాండ్ ను అక్టోబర్ 7 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

ఫలితంగా తిరిగి ఎమ్మెల్సీని పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. మరోపక్క, హత్యకేసులో నిందితుడిగా వున్న ఆయనను వైసీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తనవద్ద డ్రైవర్ గా పనిచేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసాడని ఆరోపణలతో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ అనంతబాబు మే 23నుంచి రిమాండ్ లో ఉన్నాడు.