Duvvada Srinivas: వేటు పడింది.. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్

పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. పార్టీ అధినేత జగన్ ఆదేశాలతో దువ్వాడను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

Also Read: టీడీపీ నేత దారుణ హత్య.. కత్తులతో నరికి చంపిన దుండగులు..