TDP Leader Killed: టీడీపీ నేత దారుణ హత్య.. కత్తులతో నరికి చంపిన దుండగులు..

టీడీపీ నేత దారుణ హత్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

TDP Leader Killed: టీడీపీ నేత దారుణ హత్య.. కత్తులతో నరికి చంపిన దుండగులు..

Updated On : April 23, 2025 / 1:15 AM IST

TDP Leader Killed: ఒంగోలులో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. మాజీ జెడ్పీటీసీ  ముప్పవరపు వీరయ్య చౌదరిని దుండగులు అతి కిరాతకంగా చంపారు. కత్తులతో నరికి హత్య చేశారు. మంగమూరు కూడలి సమీపంలోని తన ఆఫీస్ లో వీరయ్య చౌదరి ఉన్నారు. అదే సమయంలో కత్తులతో వచ్చిన దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. వారి ముఖాలకు ముసుగులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటనా ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. హత్యలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. మరోవైపు ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. విషయం తెలిసిన వెంటనే ఆమె ప్రకాశం జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు. హత్య చేసిన నిందితులను వెంటనే పట్టుకోవాలని ఎస్పీని ఆదేశించారు హోంమంత్రి అనిత. టీడీపీ నేత దారుణ హత్యతో ఒంగోలు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Also Read: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్..