PSR Anjaneyulu Arrest: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్..
ఆంజనేయులు మూడు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. నటిని వేధించిన కేసులో ఇప్పటికే ఆయనను సీఐడీ పోలీసులు అదుపులోకి..

PSR Anjaneyulu Arrest: ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ముంబై నటి జెత్వాని వేధింపుల కేసులో సీఐడీ అధికారులు ఆయనను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడకు తరలించారు. జెత్వానిపై వేధింపుల కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఆంజనేయులు సస్పెన్షన్ లో ఉన్నారు. ఈ కేసులో ఆయనను విచారిస్తున్నారు.
Also Read: ఏపీ లిక్కర్ స్కామ్.. రాజ్ కేసిరెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం.. 12 గంటల పాటు సుదీర్ఘ విచారణ
ఆంజనేయులు మూడు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. నటి జెత్వానిని వేధించిన కేసులో ఇప్పటికే ఆయనను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకోగా, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న కేఆర్ సూర్యానారాయణను తుపాకీతో బెదిరించారనే అభియోగంపై కేసు నమోదైంది. గుంటూరు సీఐడీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.