Raj Kesireddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డికి రిమాండ్..

లిక్కర్ లింక్స్ ను బయట పెట్టేందుకు రాజ్ కేసిరెడ్డిని కస్టడీకి కోరే అవకాశం ఉంది.

Raj Kesireddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డికి రిమాండ్..

Updated On : April 23, 2025 / 12:45 AM IST

Raj Kesireddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. మే 6వ తేదీ వరకు రిమాండ్ విధించింది. లిక్కర్ స్కామ్ కేసులో కేసిరెడ్డి ఏ1గా ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 12 గంటల పాటు కేసిరెడ్డిని విచారించిన అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు. అక్కడ వైద్య పరీక్షలు జరిపి కోర్టుకు తరలించారు.

రాజ్ కేసిరెడ్డి కేసులో ఏసీబీ కోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి. కేసిరెడ్డి అరెస్ట్ పై టెక్నికల్ గా తప్పులు ఉన్నాయని ఆయన తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. పీసీ యాక్ట్ నమోదు చేయటంపై న్యాయవాది పొన్నవోలు, ప్రభుత్వ తరపు న్యాయవాది కళ్యాణి మధ్య వాదనలు జరిగాయి. కేసిరెడ్డి పబ్లిక్ సర్వంట్ అవుతారని వాదించారు పీపీ కళ్యాణి. పబ్లిక్ సర్వంట్ కానందున 17(A) ప్రకారం శాంక్షనింగ్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలని వాదించారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి.

కేసిరెడ్డి రాజ్ పబ్లిక్ సర్వంటా? కాదా? అని స్పష్టత ఇవ్వాలన్నారు జడ్జి. ప్రభుత్వం తరపు నుంచి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని కేరళ కోర్ట్ గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ తెలిపాన పీపీ కళ్యాణి. ఎంత మొత్తంలో అవినీతి జరిగిందని జడ్జి ప్రశ్నించగా 3,200 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని కోర్ట్ కి తెలిపాన పీపీ కళ్యాణి. హవాలా రూపంలో షెల్ కంపెనీల ద్వారా పెద్దఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయాని పీపీ కళ్యాణి తెలిపారు.

ప్రభుత్వ ఐటీ సలహాదారు పబ్లిక్ సర్వంటా కదా? అని ముందు తేల్చాలని 17(A) ఏమి చెబుతుందని తెలియ చేయాలన్నారు జడ్జి. సిట్ వేసేటప్పుడే ఈ కేసును ఏ కోర్టుకి అలాట్ చేసిందో ప్రభుత్వం జీవోలో తెలపలేదని కోర్టుకి తెలిపారు పొన్నవోలు. సిట్ అధికారుల తీరుపై జడ్జి అసహనం వ్యక్తం చేశారు. సీఐడీ కోర్టులో చేయాల్సిన విచారణ ఏసీబీ కోర్టుకి ఎలా తెచ్చారని ప్రశ్నించారు. ఈ కేసులో ఇంతవరకు ప్రభుత్వ అధికారులను ఎవరినైనా అరెస్ట్ చేశారా అని జడ్జి ప్రశ్నించారు. గత సంవత్సరం సెప్టెంబర్ లో నమోదు చేశారని తెలిపారు పొన్నవోలు.

గంట ముందు మెమో వేశారని మీకే స్పష్టత లేకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు జడ్జి. మెమో ఉదయమే ఇచ్చేందుకు ప్రయత్నించాము కానీ మధ్యాహ్నం 3:30 కి ఇచ్చినట్లు కోర్టుకి అందించామని పీపీ కళ్యాణి తెలిపారు. సిఐడి కోర్టుకి రిటర్న్ చేస్తామని జడ్జి చెప్పారు. మీ పైఅధికారులతో మాట్లాడుకుని తెలపమని బెంచ్ దిగి వెళ్లారు జడ్జి.

విచారణకు హాజరవుతానని చెప్పినా తనను అరెస్ట్ చేశారని కేసిరెడ్డి న్యాయమూర్తికి తెలిపారు. కార్ సీజ్ చేశారు. నా ఇంటితో పాటు నా బంధువుల ఇళ్లలో, స్నేహితుల ఇళ్లలో సోదాలు చేశారని చెప్పారు. సోదాల్లో ఏమైనా సీజ్ చేశారా అని న్యాయమూర్తి అడిగారు. కారు తప్ప ఏమీ సీజ్ చేయలేదని తెలిపారు కేసిరెడ్డి. విచారణ పేరుతో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టారని న్యాయమూర్తికి తెలిపాన కేసిరెడ్డి.

Also Read: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్..

సిట్ అధికారులే రిపోర్ట్ ఇచ్చారని, తాను సంతకాలు చేయలేదని కోర్టుకు తెలిపారు కేసిరెడ్డి. రిమాండ్ రిపోర్ట్ తయారుపై సిట్ పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమాండ్ రిపోర్టులో కనీసం ఫారాలు లేవు, పేజీ నెంబర్లు లేవున్నారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేదు కదా ఎలా అరెస్ట్ చేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు. సత్యప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పీపీ తెలిపారు. విచారణకు ఏ మాత్రం సహకరించట్లేదన్నారు. పూర్తి స్థాయిలో కస్టడీ తీసుకుని విచారణ చేయాలన్నారు.

కోర్టు ప్రొసీజర్స్ ని ఫాలో అవ్వాలని సుప్రీంకోర్టు ఎన్నిసార్లు చెప్పినా.. మేము ఎన్నిసార్లు చెప్పినా మీలో మార్పు రావడం లేదన్నారు. ఎప్పుడు మేము చెప్తామో ఆ కేసుల వివరాలు ఇస్తారు. తర్వాత కేసులో మళ్ళీ ఇదే పరిస్థితి. రిమాండ్ రిపోర్ట్ తీరుపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.