Vasantha Vs Devineni: మైలవరంలో టీడీపీ టికెట్‌పై వసంత, దేవినేని మధ్య పోరు

 Vasantha Vs Devineni: ఈ నెల 21 నుంచి అన్నేరావుపేటలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.

Vasantha Vs Devineni

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ మైలవరంలో టీడీపీ పంచాయితీ ఉత్కంఠ రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో తానే మైలవరం నుంచి తిరిగి పోటీ చేస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అంటున్నారు. ఈ నెల 21 నుంచి అన్నేరావుపేటలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.

టీడీపీలో చేరటానికి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సిద్ధమవుతున్నారు. మైలవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దేవినేని ఉమా, వసంత కృష్ణ ప్రసాద్ ఇద్దరిలో ఒకరిని పెనమలూరుకు పంపాలనే యోచనలో టీడీపీ అధిష్ఠానం ఉంది.

మైలవరం టీడీపీలో ఎవరికి వారు కేడర్ తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వసంత కృష్ణ ప్రసాద్‌పై దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మరికొన్ని రోజుల్లో టీడీపీ-జనసేన తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ కోసం నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

జనసేన కోరిన చోట బలంగా ఉన్న టీడీపీ ఆశావాహ అభ్యర్థులు.. ఏం జరుగుతోందో తెలుసా?