జనసేన కోరిన చోట బలంగా ఉన్న టీడీపీ ఆశావాహ అభ్యర్థులు.. ఏం జరుగుతోందో తెలుసా?

Visakhapatnam: ప్రస్తుతం టీడీపీ సమన్వయకర్తగా కోరాడ రాజాబాబు కొనసాగుతున్నారు. గాజువాక సీటుపై జనసేన నుంచి పట్టు సుందరపు సతీశ్ కూమార్..

జనసేన కోరిన చోట బలంగా ఉన్న టీడీపీ ఆశావాహ అభ్యర్థులు.. ఏం జరుగుతోందో తెలుసా?

AP Politics

టీడీపీ-జనసేన పోత్తులో భాగంగా సీట్ల పంచాయితీ ఇంకా తేలలేదు. విశాఖలో జనసేన సీట్లు ఆశిస్తున్న పలు నియోజక వర్గాల్లో బలమైన టీడీపీ అభ్యర్థులు ఉన్నారు. దక్షిణ నియోజకవర్గం కోసం ఎమ్మెల్సీ వంశీకృష్ణ, 39 వార్డు కార్పోరేటర్ సాధిక్ ఫైట్ చేస్తున్నారు.

అదే స్థానంలో గండి బాబ్జికీ మంచి పాపులారిటీ ఉంది. భీమిలి సీటును కావాలని జనసేన అడుగుతోంది. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు పంచకర్ల సందీప్. దక్షిణం లేకపోతే భీమిలిలో పోటికి వంశీకృష్ణ పోటీ చేస్తానంటున్నారు.

భీమిలి సీటే కావాలని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ సమన్వయకర్తగా కోరాడ రాజాబాబు కొనసాగుతున్నారు. గాజువాక సీటుపై జనసేన నుంచి పట్టు సుందరపు సతీశ్ కూమార్ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది.

గాజువాక సీటు కష్టమైతే యలమంచిలి నుంచి పోటీకి సిద్ధమంటున్నారు సతీశ్ కుమార్, విజయ్ కుమార్. గాజువాకలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ రావు బలంగా ఉన్నారు. గతంలో టీడీపీ నుంచి గాజువాకలో గెలుపొందారాయన.

పెందుర్తి సీటు కావలంటూ జనసేన నేత పంచకర్ల రమేశ్ బాబు.. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నుంచి అదే స్థానంలో బరిలో దిగుతానని బండారు సత్యనారాయణ అంటున్నారు. గతంలో పెందుర్తి నుంచి బండారు సత్యనారాయణ గెలుపొందారు.

అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొణతాల పోటీలో దిగుతాయని తెలుస్తోంది. అనకాపల్లిలో టీడీపీ నేత పీలా గోవింద్ సత్యనారాయణ బలమైన నేత. ఆ స్థానంలో పోటీ చేస్తానంటున్నారు.

Kodali Nani : గుడివాడ వైసీపీలో కొత్త రాజకీయం.. కొడాలి నానికి వైసీపీ అధిష్టానం షాకివ్వబోతుందా?