Kodali Nani : గుడివాడ వైసీపీలో కొత్త రాజకీయం.. కొడాలి నానికి వైసీపీ అధిష్టానం షాకివ్వబోతుందా?

గుడివాడ వైసీపీ అభ్యర్థి హన్మంతరావుకు శుభాకాంక్షలు అంటూ ప్రధాన కూడళ్లలో ప్లెక్సీలు వెలిశాయి.

Kodali Nani : గుడివాడ వైసీపీలో కొత్త రాజకీయం.. కొడాలి నానికి వైసీపీ అధిష్టానం షాకివ్వబోతుందా?

Gudivada

Updated On : February 19, 2024 / 3:00 PM IST

Gudivada Flexi Issue : గుడివాడ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కొద్దిరోజులుగా నియోజకవర్గాల వారిగా ఇంఛార్జులను మార్పులు చేర్పులు చేస్తూ వైసీపీ అధిష్టానం జాబితాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏడు జాబితాలు విడుదలైనప్పటికీ గుడివాడ నియోజకవర్గం సీటుపై క్లారిటీ ఇవ్వలేదు. ఎమ్మెల్యే కొడాలినానికి కంచుకోట అయిన గుడివాడ నియోజకవర్గంలో మళ్లీ కొడాలి నానినే బరిలో నిలుస్తాడని అందరూ భావిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా కొడాలి నానికి షాకిస్తూ అసమ్మతి సెగ బయటపడింది. గుడివాడ వైసీపీ అభ్యర్థి హన్మంతరావుకు శుభాకాంక్షలు అంటూ ప్రధాన కూడళ్లలో ప్లెక్సీలు వెలిశాయి.

Also Read : YCP MP Magunta : టీడీపీలోకి వైసీపీ ఎంపీ మాగుంట.. ఒంగోలు లోక్‌స‌భ‌ బరిలో రాఘవరెడ్డి?

వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండల హనుమంతరావుకు సీఎంవో నుంచి పిలుపు వచ్చిందంటూ వైసీపీలోని కొందరు మాట్లాడుకుంటున్నారు. హన్మంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతుంది. దివంతగత వైఎస్ఆర్ కుటుంబానికి వీరవిధేయుడిగా హన్మంతరావుకు గుర్తింపు ఉంది. పట్టణంలో బ్యానర్లు వెలియడంతో రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ప్లెక్సీల వ్యవహారంపై కొడాలి నాని, ఆయన వర్గీయుల నుంచి, మండల హన్మంతరావు వైపు నుంచి అధికారిక స్పందన రాలేదు. కానీ గుడివాడ పట్టణంలో వెలసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.