YCP MP Magunta : టీడీపీలోకి వైసీపీ ఎంపీ మాగుంట.. ఒంగోలు లోక్‌స‌భ‌ బరిలో రాఘవరెడ్డి?

ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రెండుమూడు రోజుల్లో చేరిక తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

YCP MP Magunta : టీడీపీలోకి వైసీపీ ఎంపీ మాగుంట.. ఒంగోలు లోక్‌స‌భ‌ బరిలో రాఘవరెడ్డి?

Magunta Sreenivasulu Reddy

Updated On : February 19, 2024 / 2:25 PM IST

Magunta Sreenivasulu Reddy : ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైకిల్ సవారీకి సిద్ధమయ్యారు. ఈనెల చివరిలో లేదా మార్చి మొదటి వారంలో ఆయన టీడీపీలోకి చేరనున్నారు. రెండు, మూడు రోజుల్లో టీడీపీలో చేరే తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈసారి కొడుకు రాఘవ రెడ్డిని ఒంగోలు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించే యోచనలో మాగుంట ఉన్నారు. మాగుంట చేరికతోపాటు రాఘవరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపేందుకు టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. మాగుంట రాకతో ఒంగోలు పార్లమెంట్ సగ్మెంట్ లో టీడీపీ బలం పెరగనుంది.

Also Read : విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్దిపై చర్చకు సిద్ధం.. దేవినేని అవినాష్

మాగుంట శ్రీనివాసులు టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైంది. మరో రెండు మూడు రోజుల్లో టీడీపీలో చేరే తేదీ ఫైనల్ అవుతుందని మాగుంట వర్గీయులు భావిస్తున్నారు. అయితే, గతంలో ముహూర్తం విషయంలో సరిగా నిర్ణయం తీసుకోలేదని కొందరు పురోహితులు ఆయన వద్ద ప్రస్తావించారట.. ఈ నేపథ్యంలో ఈసారి మంచి ముహూర్తం చూసుకొని టీడీపీలో చేరాలని మాగుంట భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మంచి ముహూర్తంపై పురోహితులను మాగుంటి సంప్రదించగా.. ఈ నెల చివరి వారంలో, మార్చి మొదటి వారంలో పలు తేదీలను సూచించినట్లు సమాచారం.

Also Read : BJP MP Laxman : బీఆర్ఎస్ ఎంపీలు మాతో ట‌చ్‌లో ఉన్నారు.. తెలంగాణలో పొత్తులపై లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా కొడుకు రాఘవరెడ్డిని బరిలోకి దింపాలని మాగుంట భావిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధిష్టానం నుంచిసైతం గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. గత పది రోజుల నుంచి ఒంగోలు ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా టీడీపీ బలాబలాలపై మాగుంట ఆరా తీస్తున్నారని ఆయన వర్గీయుల నుంచి తెలుస్తోంది. టీడీపీలో చేరే నాటికి నియోజకవర్గం పరిధిలో లోటుపాట్లు గుర్తించి, టీడీపీలో చేరిన తరువాత అధిష్టానం సహకారంతో వాటిని చక్కదిద్దుకునేందుకు మాగుంట దృష్టిసారించినట్లు సమాచారం.