రోజాపై వైసీపీ నాయకురాలు కేజే శాంతి ఫైర్.. నగరికి పట్టిన శని వదిలిందంటూ వీడియో

రోజా ఓడిపోవడంతో నగరిలో ఇప్పుడు పండుగ వాతావరణం ఉందని వైసీపీ నాయకురాలు కేజే శాంతి వ్యాఖ్యానించారు.

KJ Shanti Fires on RK Roja: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆర్కే రోజాపై నగరి వైసీపీ నాయకురాలు కేజే శాంతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రోజా ఓడిపోవడంతో నగరిలో ఇప్పుడు పండుగ వాతావరణం ఉందని వ్యాఖ్యానించారు. 10 ఏళ్లుగా నగరికి శనిలా మారిందని, రోజా వల్లే వైసీపీకి శని దాపురించిందని ఫైర్ అయ్యారు. పదేళ్లుగా నగరిలో అనేక అరాచకాలు, అక్రమాలు రోజా చేసిందని ఆరోపించారు. నగరిని అడ్డాగా చేసుకుని కుటుంబ పరిపాలన, అక్రమ పాలన సాగించారని ధ్వజమెత్తారు.

చిత్తుగా ఓడించి రాష్ట్రంలో ఎక్కడా కనిపించకుండా నిన్ను ప్రజలు భూస్థాపితం చేశారని వ్యాఖ్యానించారు. ”రాజకీయాలు తెలియని వ్యక్తి నువ్వు. నిన్ను నెత్తిన పెట్టుకుని ఎంతో తప్పుచేశాం. నగరిని నాశనం చేశావు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని ఉండు. ఇక నగరికి మంచి రోజులు వస్తాయి. మళ్లీ షూటింగులకు వెళ్లి అడుక్కు తిను పో” అంటూ వీడియో విడుదల చేశారు కేజే శాంతి.

Also Read: వైసీపీకి ఓటువేసిన వారిని ఇళ్ల నుంచి బయటకు పిలిచి కొడుతున్నారు: గుడివాడ అమరనాథ్

కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ చేతిలో 45004 ఓట్ల తేడాతో రోజా ఓటమి పాలయ్యారు. సొంత పార్టీవాళ్లే తనను ఓడించారని రోజా ఆరోపించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా రోజా, శాంతి వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్వయంగా కలగజేసుకుని వీరిద్దరినీ కలిపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ట్రెండింగ్ వార్తలు