Nara Bhuvaneshwari Full Speech at Euphoria Musical Night
Nara Bhuvaneshwari : తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘యూఫోరియా మ్యూజికల్ నైట్’ (Euphoria Musical Night) నిర్వహించారు.
Read Also : Pawan Kalyan : పవన్ మంచి మనస్సు.. ఎన్టీఆర్ ట్రస్ట్‌కి రూ. 50 లక్షలు విరాళం
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. తలసేమియాతో బాధపడే చిన్నారుల కోసమే ఈ యూఫోరియా మ్యూజికల్ నైట్ అని పేర్కొన్నారు. తలసేమియా బారినపడిన చిన్నారులకు అండగా నిలబడేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు.
ప్రతిఒక్కరూ ఏమి ఆశించకుండా పెద్దఎత్తున మద్దతు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తలసేమియా చిన్నారులకు భరోసా ఇవ్వడమే యుపోరియా మ్యూజికల్ నైట్ ఉద్దేశమని తెలిపారు. సీఎం హోదాలో ఉన్నప్పటికీ ఒక పౌరుడిగా టికెట్ కొని వచ్చిన సీఎం చంద్రబాబుకు భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు.
తలసేమియా చిన్నారులు చాలా ఇబ్బంది పడుతున్నారని, వారికి రక్త మార్పిడి అవసరమని చెప్పారు. వారికి రక్తదానమే ప్రాణదానమేని పేర్కొన్నారు. యువత రక్తదాతలుగా మారాలని పిలుపునిచ్చారు. అందరితో రక్తదానం చేయించాలని కోరారు.
Read Also : CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత కాలం ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటుంది : సీఎం చంద్రబాబు
ఈ చిన్నారుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఒక్కో సెంటర్‌కు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల రూపాయల ఖర్చవుతోందన్నారు. వచ్చే డబ్బులతో మరిన్ని కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఏమీ ఆశించకుండా వచ్చిన తమన్, యాంకర్ సుమ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నారా భువనేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.