Nara Bhuvaneshwari : చంద్రబాబు అరెస్ట్ తరువాత దుర్గమ్మను దర్శించుకున్న నారా భువనేశ్వరి.. ఏపీ ప్రజలకు విజ్ఞప్తి

చంద్రబాబును అరెస్ట్ చేసిన తరువాత ఆయన భార్య భువనేశ్వరి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Nara Bhuvaneshwari : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఉన్న ఆయన్ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు (Chandrababu Naidu) ప్రధాన నిందితుడు అంటూ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే చంద్రబాబును అరెస్ట్ చేసిన తరువాత ఆయన భార్య భువనేశ్వరి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. సాధారణ భక్తురాలిగా క్యూ లైన్ లో నిలబడి భువనేశ్వరి దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆమె వెంట సోదరుడు నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) తోడు రాగా ఆమె దుర్గమ్మను దర్శిచుకున్నారు.

Pawan Kalyan: చంద్రబాబు అరెస్ట్.. ప్రత్యేక విమానంలో అమరావతికి పవన్ కళ్యాణ్

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చంద్రబాబు పోరాడుతున్నారని.. ఏపీ ప్రజల హక్కుల కోసం..న్యాయం కోసం పోరాడుతున్నారని ఆయన పోరాటానికి తోడుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి నమస్కారాలు అన్నారు. చంద్రబాబు పోరాటం ఆయన కుటుంబం కోసం కాదు ఏపీ ప్రజల కోసమన్నారు. ఏ బిడ్డకైనా మనస్సు బాధపడితే కష్టంలోనే ఉంటే తల్లితో చెప్పుకుంటుంది. అందుకే తాను దుర్గమ్మకు వద్దకొచ్చానని, తన కష్టాలు చెప్పుకున్నానని తెలిపారు. అరెస్ట్ అయినా చంద్రబాబుకు మనోధైర్యం ఇవ్వాలని దుర్గమ్మకు చెప్పుకున్నానని అన్నారు. అమ్మవారి ని నేను కోరింది ఒక్కటే నా భర్తను రక్షించమని కోరుకున్నానని తెలిపారు. ఆయనకి మనోధైర్యం ఇవ్వమని కోరానని తెలిపారు.

చంద్రబాబు చేసే పోరాటం తన కోసం కాదు తన కుటుంబ కోసం కాదు ఏపీ ప్రజల స్వేచ్చకోసం చేస్తున్నారు. ప్రజలంతా చేయి చేయి చేయి కలిపి చంద్రబాబు పోరాటానికి తోడు ఉండాలని కోరారు. చంద్రబాబు పోరాటం దిగ్విజయం కావాలని కోరుతున్నానని తెలిపారు. మీరందరూ పోరాటం చేయాలి అది మీ హక్కు అంటూ ఏపీ ప్రజలకు నారా భువనేశ్వరి సూచించారు.

Balakrishna : చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రే, రెండేళ్ల క్రితం అవినీతి జరిగితే ఛార్జ్ షీట్ ఏది..? : బాలకృష్ణ

చంద్రబాబుని సీఎం చేయటానికి కలిసి పనిచేద్దాం : నందమూరి రామకృష్ణ 
అలాగే సోదిరి భువనేశ్వరికి తోడుగా దుర్గమ్మ దేవాలయానికి వచ్చిన నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. అందరి ఆశీస్సులు మా కుటుంబానికి కావాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు రాత్రికి రాత్రి చంద్రబాబును అరెస్టు చేయడం అన్యాయమన్నారు. అంతా మోసపూరితంగా అరెస్ట్ చేశారని అన్నారు. చంద్రబాబు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం శ్రనిస్తున్నారని ఏపీని వదిలేసి ముఖ్యమంత్రి విదేశాలకు తిరుగుతున్నారు అంటూ జగన్ పై మండిపడ్డారు. అది మన దౌర్భాగ్యం చంద్రబాబు ను ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని నెంబర్ వన్‌లో నిలుపుదాం అంటూ ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు నందమూరి రామకృష్ణ పిలుపునిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు