Balakrishna : చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రే, రెండేళ్ల క్రితం అవినీతి జరిగితే ఛార్జ్ షీట్ ఏది..? : బాలకృష్ణ

ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడే సీఎం ఉండటం ఏపీ ప్రజల దౌర్భాగ్యం అని బాలకృష్ణ మండిపడ్డారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలకు ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారు అని అన్నారు.

Balakrishna : చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రే, రెండేళ్ల క్రితం అవినీతి జరిగితే ఛార్జ్ షీట్ ఏది..? : బాలకృష్ణ

MLA Balakrishna React on Chandrababu Arrest

Balakrishna- Chandrababu Arrest: మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ చేయటం రాజకీయ కుట్రేనన్నారు. ఇటువంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడే సీఎం ఉండటం ఏపీ ప్రజల దౌర్భాగ్యం అని బాలకృష్ణ మండిపడ్డారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలకు ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారు అని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ఓ పెద్ద కుంభకోణం అంటూ వైసీపీ ప్రచారం చేస్తోందని.. ఇది వైసీపీ చేసి కుట్ర తప్ప ఎటువంటి వాస్తవం లేదన్నారు. రెండేళ్ల క్రితం దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని చెబుతున్నారు. కానీ నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇప్పటి వరకు ఎందుకు చార్జ్ షీట్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు.

Pawan Kalyan : చంద్రబాబు అరెస్ట్ కచ్చితంగా కక్ష సాధింపే : పవన్ కల్యాణ్

ఇటువంటి అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చంద్రబాబు నాయుడుకి ఉండే క్రేజ్ ను పరువును తీద్దామనుకునే కుట్రలు సాగవన్నారు. ఇటువంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అభివృద్ధి చేయటం చేతకాక ప్రతిపక్ష నాయకులపై కుట్రలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి కక్ష సాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. తాను 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడుని కనీసం 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలనే కుట్రే ఈ అరెస్టుకు కారణమన్నారు. ఈ కక్షతోనే జగన్ ఇటువంటి దుర్మార్గకు చర్యలకు పాల్పడుతున్నారు అంటూ మండిపడ్డారు.

Nara Lokesh : నా తండ్రిని అరెస్ట్ చేస్తే నన్ను రెస్ట్ తీసుకోమంటారా..? అంటూ పోలీసులపై లోకేశ్ ఫైర్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు? అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ పెద్ద కుంభకోణమని ప్రచారం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. ఇది కావాలనే రాజకీయ కక్షతో చేస్తున్న కుట్ర అని అన్నారు. ప్రభుత్వం చేసే కోర్టు ఎన్నిసార్లు చీవాట్లు వేసిందో అందరికి తెలిసిందేనంటూ ఎద్దేవా చేశారు. అవినీతి లేని కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని.. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదని.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని.. ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని అన్నారు బాలకృష్ణ.