అన్న క్యాంటీన్లకు కోటి రూపాయలు.. నారా భువనేశ్వరి భారీ విరాళం

అన్న క్యాంటీన్లలో రూ.5కే టిఫిన్, లంచ్, డిన్నర్ అందిస్తారు. హరేక్రిష్ణ మూవ్ మెంట్ సంస్థకు అన్న క్యాంటీన్ల నిర్వహణ అప్పగించింది చంద్రబాబు సర్కార్.

Nara Bhuvaneswari Donation : ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరుపున ఏకంగా కోటి రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు విరాళం చెక్కును మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు అందజేశారు. పేదల కడుపు నింపేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని కొనియాడారు. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అనేది ఎన్టీఆర్ నినాదమని ఆమె గుర్తు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించనుంది. గుడివాడలో అన్న క్యాంటీన్ ను స్వయంగా సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికారుల సమక్షంలో అన్న క్యాంటీన్లను స్టార్ట్ చేస్తారు. అన్న క్యాంటీన్లలో రూ.5కే టిఫిన్, లంచ్, డిన్నర్ అందిస్తారు. హరేక్రిష్ణ మూవ్ మెంట్ సంస్థకు అన్న క్యాంటీన్ల నిర్వహణ అప్పగించింది చంద్రబాబు సర్కార్. దశలవారీగా అన్న క్యాంటీన్లను ప్రభుత్వం పెంచనుంది. ఆగస్టు 15వ తేదీన రాష్ట్రంలో 99 క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 5న మరో 99 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.

బ్రేక్ ఫాస్ట్..
సోమవారం ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్.. లేదా పూరీ, కుర్మా
మంగళవారం ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా, చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్
బుధవారం ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబారు
గురువారం ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా
శుక్రవారం ఇడ్లీ, చట్నీ/ పొడి, సాంబార్ లేదా ఉప్మా, చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్
శనివారం ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబార్

ప్రతీరోజు వైట్ రైస్, కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు, పచ్చడి
వారంలో ఒకరోజు స్పెషల్ రైస్

టైమింగ్స్.. బ్రేక్ ఫాస్ట్-ఉదయం 7 నుంచి 10 గంటల వరకు
లంచ్ – మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు
డిన్నర్ – రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు
ఇక ఆదివారం అన్న క్యాంటీన్లకు సెలవు.

Also Read : అన్న క్యాంటీన్లలో ఫుడ్ మెనూ ఇదే.. ఏమేం పెడతారో తెలుసా? టైమింగ్స్ ఏంటంటే..

ట్రెండింగ్ వార్తలు