Nara Bhuvaneswari : మా పుట్టింటికి రెండో పద్మం.. బాల అన్నయ్య అంటూ నారా భువనేశ్వరి ఎమోషనల్ ట్వీట్..

బాలకృష్ణ చెల్లి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయిడు భార్య నారా భువనేశ్వరి తన సోషల్ మీడియాలో బాలకృష్ణపై ఓ ఎమోషనల్ ట్వీట్ చేసింది.

Nara Bhuvaneswari : మా పుట్టింటికి రెండో పద్మం.. బాల అన్నయ్య అంటూ నారా భువనేశ్వరి ఎమోషనల్ ట్వీట్..

Nara Bhuvaneswari Emotional Tweet on Balakrishna For Getting Padma Bhushan Award

Updated On : January 26, 2025 / 6:26 PM IST

Nara Bhuvaneswari : తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు బాలయ్య బాబుకు అభినందనలు తెలుపుతున్నారు. పలువురు ప్రముఖులు బాలయ్య ఇంటికి వెళ్లి మరీ అభినందిస్తున్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ చెల్లి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయిడు భార్య నారా భువనేశ్వరి తన సోషల్ మీడియాలో బాలకృష్ణపై ఓ ఎమోషనల్ ట్వీట్ చేసింది.

Also Read : Manchu Vishnu : మంచు విష్ణు మంచి మనుసు.. వారి కోసం 50% స్కాలర్‌షిప్‌.. ఎవరెవరికి? డీటెయిల్స్ ఇవే..

నారా భువనేశ్వరి తన ట్వీట్ లో.. మా పుట్టింటికి రెండో పద్మం రావడం మా అందరికీ గర్వంగా ఉంది. బాల అన్నయ్య .. జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ వంటి చిత్రాలలో నటించి చిత్ర సీమలో 50 ఏళ్ల నట ప్రస్థానం ఇటీవలే పూర్తి చేసుకొని కళామతల్లిని మెప్పిస్తూనే వున్నాడు. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం అందుకుని తన వంతు బాధ్యతలు నిర్వహిస్తూ, బసవ తారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్‌గా కూడా తన సేవలు అందిస్తూ ఉన్నాడు. మా ముద్దుల బాల అన్నయ్య ఇప్పుడు పద్మభూషణ్ బాలకృష్ణ అయిన సందర్భంగా శుభాకాంక్షలు. ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. అలాగే ఈ ఏట పద్మ పురస్కారాలు అందుకొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు అంటూ తెలిపారు.

గతంలో ఎన్టీఆర్ కు పద్మశ్రీ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలయ్యకు కూడా పద్మ భూషణ్ రావడంతో పుట్టింటికి రెండు పద్మాలు అంటూ రాసుకొచ్చింది. బాల అన్నయ్య అంటూ ప్రేమగా నారా భువనేశ్వరి ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇప్పటికే బాలయ్య కూడా అవార్డు వచ్చినందుకు స్పందిస్తూ ఈ అవార్డు తనకు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read : Sai Pallavi : చదివిన స్కూల్‌కే గెస్ట్ గా వెళ్లిన సాయి పల్లవి.. ఇది కదా సక్సెస్.. తన స్కూల్ డేస్ గురించి ఏం చెప్పిందంటే..

గత కొన్నాళ్లుగా బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అఖండ సినిమా నుంచి వరుసగా హిట్స్ కొడుతున్నారు. మరో వైపు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంకోవైపు అన్‌స్టాపబుల్ లో హోస్ట్ గా అలరిస్తున్నారు. ఇటీవల సంక్రాంతికి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో వచ్చి హిట్ కొట్టారు. త్వరలో అఖండ 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.