Sai Pallavi : చదివిన స్కూల్‌కే గెస్ట్ గా వెళ్లిన సాయి పల్లవి.. ఇది కదా సక్సెస్.. తన స్కూల్ డేస్ గురించి ఏం చెప్పిందంటే..

తాజాగా సాయి పల్లవి తను చదివిన స్కూల్ కే గెస్ట్ గా వెళ్ళింది.

Sai Pallavi : చదివిన స్కూల్‌కే గెస్ట్ గా వెళ్లిన సాయి పల్లవి.. ఇది కదా సక్సెస్.. తన స్కూల్ డేస్ గురించి ఏం చెప్పిందంటే..

Sai Pallavi went to Her School as Guest in Coimbatore Speech goes Viral

Updated On : January 26, 2025 / 4:58 PM IST

Sai Pallavi : తక్కువ టైంలోనే తన నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులను మెప్పించి బోలెడంతమంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది సాయి పల్లవి. కొన్ని రోజుల క్రితం వరకు వరుసగా సినిమాలు చేసినా ప్రస్తుతం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. మొదటి సినిమా నుంచి కూడా మంచి పాత్రలను సెలెక్ట్ చేసుకొని ఆ పాత్రల్లో మెప్పిస్తుంది. సినిమాల్లోనే కాక బయట కూడా ఎంతో పద్దతిగా కనిపిస్తూ, అందరితో మంచిగా ఉంటూ మరింతమందికి చేరువైంది. తెలుగులో అయితే స్టార్ హీరోలకు సమానంగా సాయి పల్లవి ఫ్యాన్ డమ్ తెచ్చుకుంది.

తాజాగా సాయి పల్లవి తను చదివిన స్కూల్ కే గెస్ట్ గా వెళ్ళింది. సాయి పల్లవి తమిళనాడు కోయంబత్తూర్ లోని అవిలా కాన్వెంట్ స్కూల్ లో చదివింది. తన స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. ఇటీవల ఆ స్కూల్ లో ఓ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్ళింది సాయి పల్లవి. ఈవెంట్లో సాయి పల్లవి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.

Also Read : NTR – Balakrishna : ఫ్యాన్ వార్స్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ కౌంటర్..? వాళ్ళు బానే ఉంటారు.. బాలయ్యతో విభేదాలపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చినట్టే..

తన స్కూల్ కి గెస్ట్ గా వెళ్లిన సాయి పల్లవి అక్కడ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నా స్కూల్ లో చాలా మెమరీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆడిటోరియంతో నాకు ఇంకా జ్ఞాపకాలు ఉన్నాయి. స్కూల్ లో ఎక్కువ సమయం నేను ఈ ఆడిటోరియంలోనే గడిపాను. క్లాసెస్ ఎగ్గొట్టి మరీ ఇక్కడికి వచ్చి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే దాన్ని. అప్పుడు క్లాస్ లో అటెండెన్స్ ఇచ్చి ఇక్కడికి వచ్చి రోజంతా ప్రాక్టీస్ చేసేదాన్ని, దానికి నేను చాలా తెలివైనదాన్ని అని ఫీల్ అయ్యేదాన్ని. కానీ తర్వాత తెలిసింది టీచర్లకు నేను ఇక్కడికి వస్తుంది తెలుసు కానీ ఏమి అనకుండా సపోర్ట్ ఇచ్చారు. స్టేజ్ ఫియర్ అనేది చాలా చిన్న ఏజ్ లోనే పోగొట్టుకున్నాను ఈ ఆడిటోరియం వల్ల. ఆల్మోస్ట్ 12 ఏళ్ళు అయింది ఈ ఆడిటోరియంని మిస్ అయి. ఈ ఏజ్ లో బయట జనాలు, సోషల్ మీడియా మన దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తాయి. ఇలాంటి ఒక మంచి స్కూల్, నా పేరెంట్స్ ఉండటం వల్ల నేను ఆ ఏజ్ లో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా డ్యాన్స్, చదువుపై ఫోకస్ చేశాను. డ్యాన్స్, స్టడీ మాత్రమే కాకుండా క్రమశిక్షణ, ఒక మంచి మనిషిగా ఎలా ఉండాలి అని ఇక్కడే నేర్చుకున్నా. అలాగే ఏదో ఒక సమయంలో మనం మనతో మాట్లాడాలి అని అర్ధం చేసుకున్నా. మనం ఏం అవ్వాలి, ఎలా ఉండాలి అని ఇక్కడే నేర్చుకున్నాను అంటూ తన స్కూల్ జ్ఞాపకాలను పంచుకుంది.

Also Read : Vijay Deverakonda : మొదలైన VD14 సినిమా.. యోధుడిగా విజయ్ దేవరకొండ.. భారీ సెట్ కోసం..

ఇక సాయి పల్లవి ఇటీవల అమరన్ సినిమాతో వచ్చి మెప్పించింది. త్వరలో తండేల్ సినిమాతో రానుంది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ , సాంగ్స్ రిలీజయి అంచనాలు నెలకొన్నాయి. ఇది కాకుండా సాయి పల్లవి చేతిలో రెండు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయని సమాచారం.