NTR – Balakrishna : ఫ్యాన్ వార్స్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ కౌంటర్..? వాళ్ళు బానే ఉంటారు.. బాలయ్యతో విభేదాలపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చినట్టే..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ - బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాదులాడుకుంటున్నారు.

NTR – Balakrishna : ఫ్యాన్ వార్స్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ కౌంటర్..? వాళ్ళు బానే ఉంటారు.. బాలయ్యతో విభేదాలపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చినట్టే..

Jr NTR indirectly Counter to Fan Wars Batch on issues with Balakrishna

Updated On : January 26, 2025 / 4:30 PM IST

NTR – Balakrishna : గత కొన్నాళ్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్యపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి అభిమానులు కాస్త సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ – బాలయ్య ఫ్యాన్స్ గా మారారు. బాలకృష్ణ ఎన్టీఆర్ ని పట్టించుకోవట్లేదని, ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలిలో కలుపుకోవట్లేదని, ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ లను సపరేట్ గా చూస్తున్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. తారకరత్న మరణించిన తర్వాత ఆయన కార్యక్రమంకి సంబంధించి ఓ వీడియో వైరల్ అయింది. అందులో ఎన్టీఆర్ పలకరించినా బాలకృష్ణ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది.

దీంతో అప్పట్నుంచి కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్యని టార్గెట్ చేసారు. అయితే ఆ కార్యక్రమం బాలయ్యే దగ్గరుండి జరిపించడంతో బిజీగా ఉన్నారని, హడావిడిలో పట్టించుకోలేదని బాలయ్య ఫ్యాన్స్ వాదన. ఇటీవల అన్‌స్టాపబుల్ షోలో కూడా బాలయ్య అందరి హీరోలను తీసుకొచ్చి ఎన్టీఆర్ ని తీసుకురాలేదని, ఓ ఎపిసోడ్ లో అందరి హీరోల గురించి మాట్లాడి ఎన్టీఆర్ గురించి ప్రస్తావించలేదని ఫ్యాన్స్ హర్ట్ అయి షోని, బాలయ్యని ట్రోల్ చేసారు.

Also Read : Vijay Deverakonda : మొదలైన VD14 సినిమా.. యోధుడిగా విజయ్ దేవరకొండ.. భారీ సెట్ కోసం..

డాకు మహారాజ్ సినిమా ముందు కూడా కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ సినిమాని ట్రోల్ చేసి ఫ్లాప్ చేస్తామంటూ సోషల్ మీడియాలో హడావిడి చేసారు. గతంలో బాలకృష్ణ పలు ఈవెంట్స్ లో ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ నా బిడ్డలు అంటూ వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టినా అవన్నీ మర్చిపోయి గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ – బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాదులాడుకుంటున్నారు.

అయితే తాజాగా బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలయ్యకు అవార్డు ప్రకటించగానే ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేసారు. సాధారణంగా అభినందనలు చెప్తే పెద్దగా పట్టించుకునేవారు కాదేమో కానీ బాబాయ్ అంటూ ఇద్దరూ స్పెషల్ ట్వీట్స్ వేశారు. ఎన్టీఆర్.. పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు బాలా బాబాయ్. ఈ గుర్తింపు సినిమాకు, ప్రజాసేవకు మీరు చేసిన సేవలకు నిదర్శనం అంటూ ట్వీట్ చేసారు. ఇక కల్యాణ్ రామ్.. పద్మ భూషణ్ అవార్డు అందుకుంటున్నందుకు బాబాయ్ బాలకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ గౌరవం సినిమా ప్రపంచానికి, సమాజానికి మీరు చేసిన విశేషమైన సేవలకు నిజమైన గుర్తింపు అని రాసుకొచ్చారు.

దీంతో ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బాలయ్యను బాబాయ్ అని పిలవడంతో వీరి మధ్య విబేధాలు లేవని ఎన్టీఆర్ ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేసాడు అని ఈ గొడవలకు ఎన్టీఆర్ ముగింపు పలికాడు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది ఫ్యాన్స్ కూడా మళ్ళీ బాబాయ్ – అబ్బాయి కలిశారు అన్నట్టు పోస్టులు వేస్తున్నారు.

Also Read : Constable Song : వరుణ్ సందేశ్ కోసం.. నల్గొండ గద్దర్ నర్సన్న పాడిన కానిస్టేబుల్ సాంగ్ విన్నారా..?

ఇటీవల ఫ్యాన్ వార్స్ ఎక్కువైన సంగతి తెలిసిందే. హీరోలంతా ఫ్రెండ్స్, హీరోలంతా బానే ఉంటారు. వాళ్ళు రెగ్యులర్ గా కలిసి రెగ్యులర్ గా పార్టీలు చేసుకుంటారు కూడా. మహేష్ బాబు లాంటి సార్ హీరోనే స్టేజిపై మేము మేము బాగానే ఉంటాము మీరు బాగుండాలి అని ఫ్యాన్స్ కి చెప్పాడు. RRR సమయంలో చరణ్ – ఎన్టీఆర్ వాళ్ళెంత క్లోజ్ ఫ్రెండ్స్ అనేది పలు మార్లు చెప్పారు. అయినా కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఇంకా మా హీరో గొప్ప మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో అర్థంలేని ఫ్యాన్ వార్స్ చేస్తూ కూర్చుంటున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ బాలా బాబాయ్ అంటూ బాలయ్యకు – తనకు ఎలాంటి విబేధాలు లేవని, వాళ్లంతా ఒకటే అని సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ చేసే బ్యాచ్ కు ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు అని అంటున్నారు నెటిజన్లు.