Nara Lokesh
Nara Lokesh – TDP: సీబీఐ (CBI) తాజా చార్జిషీట్‌తో బాబాయిని ఎవరు చంపారో తెలిసిపోయిందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేక మృతి కేసు(YS Viveka case)ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం తలమళ్ల క్యాంప్ సైట్ లో కొండపి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో నారా లోకేశ్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడారు. తాము ఒక కరుడుగట్టిన నేరస్థుడితో పోరాడుతున్నామని చెప్పారు. నాలుగేళ్లలో చేసిన పోరాటం ఒకెత్తు అని, ఇప్పటినుంచి.. రాబోయే 9 నెలల్లో చేసే పోరాటం మరో ఎత్తు అని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని చెప్పారు. తాను పార్టీలో సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తానని చెప్పారు.
నకిలీ కేసులు పెట్టేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని నారా లోకేశ్ అన్నారు. ఈ తొమ్మిది నెలలు కష్టపడాలని పిలుపునిచ్చారు. కొండపి ప్రజలు టీడీపీకి ఆదరించారని తెలిపారు. ప్రజలు టీడీపీపై పెట్టుకున్న నమ్మకాన్ని వృథా చేయబోమని అన్నారు.
టీడీపీ కార్యకర్తలను అక్రమ కేసులతో జగన్ ఇబ్బంది పెట్టారని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ కష్టపడి పని చేస్తే 175 నియోజకవర్గాల్లోనూ విజయం సాధిస్తుందని తెలిపారు. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. 2024లో కొండపిలో హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నామని చెప్పారు.
భారీ మెజారిటీతో గెలిచేందుకు కృషి చేయాలని అన్నారు. గత ఎన్నికల ముందు గ్రామాల్లో ప్రజల కోసం అభివృద్ధి పనులు చేశామని, కానీ ఆ పనులకు చెల్లించాల్సిన బిల్లులు జగన్ రెడ్డి నిలిపేశారని చెప్పారు. కొండపిలో పాదయాత్రను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.
Varla Ramaiah: మీ తాత రెండు పెళ్లిళ్లు చేసుకోలేదా?.. జగన్ మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే?: వర్ల రామయ్య