అదంతా వారిపనే.. తణుకు అన్న క్యాంటీన్‌లో ప్లేట్ల అపరిశుభ్రత అంశంపై స్పందించిన నారా లోకేశ్
తణుకు అన్న క్యాంటీన్ లో శుభ్రత పాటించడం లేదన్న ప్రచారంపై మంత్రి నారాయణ ఆరా తీశారు. హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులు, అధికారులు నుంచి వివరాలను ..

Minister Nara Lokesh
Minister Nara Lokesh : తణుకులోని అన్న క్యాంటీన్ లో అపరిశుభ్రమైన నీటితో తినేసిన ప్లేట్లు కడుగుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై ట్విటర్ వేదికగా మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తణుకు అన్న క్యాంటీన్ లో ప్లేట్ల అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది విష ప్రచారం అన్నారు. చేతులు కడిగే సింక్ లో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ మూకలేనని, సింక్ లో ఉన్న ప్లేట్లు తీస్తుంటే వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుచి, శుచి శుభ్రతకు అన్న క్యాంటీన్ లలో ఎంతో ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. చేతులు కడిగే స్థలంలో వైసీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీశారు. అన్న క్యాంటీన్లపై జగన్ విషం చిమ్మటం కొనసాగిస్తూనే ఉన్నాడని లోకేశ్ ట్వీట్ లో పేర్కొన్నారు.
Also Read : ఏలూరులో వైసీపీ క్లోజ్..! పార్టీని నడిపే నాయకుడు కరువు..
తణుకు అన్న క్యాంటీన్ లో శుభ్రత పాటించడం లేదన్న ప్రచారంపై మంత్రి నారాయణ ఆరా తీశారు. హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులు, అధికారులు నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్లేట్లను మురికినీటిలో కడుగుతున్నారనేది పూర్తిగా అవాస్తమని మంత్రికి అధికారులు తెలిపారు. ఎక్కువ మంది రావడంతో డస్ట్ బిన్ కు బదులుగా వాష్ బేసిన్ లో ప్లేట్లు పెట్టారని, వాటిని తీస్తుంటే కొందరు వీడియో తీశారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అన్న క్యాంటీన్లలో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని, సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వాస్తవం కాదని హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులు, అధికారులు మంత్రికి వివరించారు.
అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై విషం చిమ్ముతూ ఉన్నాడు సైకో జగన్. రుచి, శుచి, శుభ్రతకు అన్న క్యాంటీన్‌లో అత్యంత ప్రాధాన్యమిస్తూ ఉన్నారు. చేతులు కడుగు స్థలంలో వైసిపి మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీసి ఫేక్ ప్రచారం చేస్తున్నారు.#FekuJagan#AndhraPradesh #AnnaCanteen pic.twitter.com/C6C3P4Bfk3
— Lokesh Nara (@naralokesh) August 26, 2024