Nedurumalli Ramkumar Reddy: లోకేశ్‌ చేస్తున్నది పాదయాత్రలా లేదు.. షికారు యాత్రలా ఉంది.. ఎందుకంటే?: వైసీపీ నేత

లోకేశ్ ఇక్కడ కొన్ని రోజులుగా పర్యటించినప్పటికీ ప్రజలు కొద్ది మంది మాత్రమే వెళ్లారని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Nedurumalli Ramkumar Reddy

Nedurumalli Ramkumar Reddy – YCP: టీడీపీ (TDP) నేత నారా లోకేశ్ (Nara Lokesh) పై ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. వెంకటగిరిలో లోకేశ్ చేస్తోన్న యువగళం పాదయాత్రకు స్పందన లేదని చెప్పుకొచ్చారు.

లోకేశ్ ఇక్కడ కొన్ని రోజులుగా పర్యటించినప్పటికీ ప్రజలు కొద్ది మంది మాత్రమే వెళ్లారని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. వెంకటగిరిలో 10 అడుగుల రోడ్డులో సభ నిర్వహించారని, ఇది పాదయాత్రలా లేదని.. షికారు యాత్రలా ఉందని చెప్పారు. కలువాయి ప్రాంతంలో లోకేశ్ పర్యటించినప్పటికీ ఆ ప్రాంత పేరును కూడా పలకలేకపోయారని ఆరోపించారు.

ఎవరో రాసిచ్చిన విషయాన్ని చదివి వినిపించారని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అభివృద్ధి కోసం పోరాడడంతో ఆయనను వైసీపీ నుంచి తొలగించారని చెప్పడం సరికాదని చెప్పారు. 2019లో ఆయన టీడీపీని వదిలి ఎందుకు వైసీపీలో చేరారని నిలదీశారు. టీడీపీలో అభివృద్ధి జగలేదనే పార్టీ మారినట్లు చెప్పారని అన్నారు. ఆయన వైసీపీని వీడినప్పటికీ ఇక్కడి కార్యకర్తలు మాత్రం ఆయన వెంట వెళ్లలేదని చెప్పారు.

Bandi Sanjay: దీన్ని కేటీఆర్ రాజకీయ కోణంలో చూడొద్దు: బండి సంజయ్