New Bar Policy
New Bar Policy : బార్ లైసెన్స్ దరఖాస్తుదారులకు పండగే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త బార్ పాలసీ ప్రకారం లైసెన్స్ ఫీజు భారీగా తగ్గనుంది. కొత్త బార్ విధానంలో (New Bar Policy) దరఖాస్తు రుసుమును కూడా రూ.5 లక్షలకు తగ్గించారు. లైసెన్స్ ఫీజు తగ్గింపు మాత్రమే కాదు.. లైసెన్స్ ఫీజును వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం కల్పించనుంది.
తద్వారా పాలసీ బార్ లైసెన్సీలకు మరింత లాభదాయకంగా మారే అవకాశం ఉంది. గతంలో బార్ లైసెన్స్ దారులు లైసెన్స్ ఫీజు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు అలా ఉండదు. బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపుతో పాటు వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం ఉండటంతో ఈసారి ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు రావొచ్చు. అయితే, రాష్ట్రంలోని కడపలో బార్ లైసెన్స్ ఫీజు గతంలో రూ.1.97 కోట్లుగా ఉంది.
ఇప్పుడు ఈ లైసెన్స్ ఫీజు ఏకంగా రూ. 55 లక్షలకు తగ్గింది. అలాగే, అనంతపురంలో కూడా బార్ లైసెన్స్ ఫీజు రూ. 1.79 కోట్ల నుంచి ఇప్పుడు రూ. 55 లక్షలకు తగ్గించారు. ఇక తిరుపతిలో రూ. 1.72 కోట్ల నుంచి రూ. 55 లక్షలకు లైసెన్స్ ఫీజును తగ్గించగా, ఒంగోలులో రూ. 1.4 కోట్ల నుంచి రూ. 55 లక్షలకు తగ్గించారు. బార్ లైసెన్స్ దారులు ఈ ఫీజును 6 వాయిదాల్లో చెల్లించే సదుపాయం ఉంది.
అదేవిధంగా అనంతపురంలో లైసెన్స్ ఫీజు రూ. 1.79 కోట్ల నుంచి రూ. 55 లక్షలకు తగ్గించారు. తిరుపతిలో రూ. 1.72 కోట్ల నుంచి రూ. 55 లక్షలకు, ఒంగోలులో రూ. 1.4 కోట్ల నుంచి రూ. 55 లక్షలకు తగ్గించినట్లు వెల్లడి ఎక్సైజ్ కమిషనర్ వెల్లడించారు.
లైసెన్స్ దారులు ఫీజును ఆరు వాయిదాల్లో చెల్లించే సదుపాయం ఉంది. రాష్ట్రం అంతటా బార్ లైసెన్స్ అప్లికేషన్ దరఖాస్తు రుసుమును రూ. 5 లక్షలగా నిర్ధారించారు. ఆరోగ్యకరమైన పోటీ కోసం బార్ లైసెన్సులను బహిరంగ లాటరీ ద్వారా కేటాయించనున్నారు. కొత్త దరఖాస్తుదారులను కొత్త బార్ పాలసీ ఆకట్టుకుంటునే అవకాశం ఉంది.