Site icon 10TV Telugu

AP New Bar Policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి.. వారికి 10శాతం షాపులు

Liquor Scam

AP New Bar Policy: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త బార్ పాలసీ ప్రవేశపెట్టనుంది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి రానుంది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా కొత్త బార్ పాలసీ ఉండనుందని సీఎం చంద్రబాబు తెలిపారు. మద్యం పాలసీ అంటే ఆదాయం కాదు.. ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యం అని ఆయన స్పష్టం చేశారు. ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉండే మద్యం అమ్మకాలతో నష్టం తగ్గించవచ్చన్నారు. మద్యం కారణంగా పేదల ఇల్లు, ఒల్లు గుల్ల కాకుండా చూడాలన్నారు. బార్లలో కూడా గీత కార్మిక వర్గాలకు 10 శాతం షాపులు కేటాయించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

ఇప్పటికే మద్యం దుకాణాల్లో 10 శాతం షాపులు కల్లు గీత కార్మికులకు కేటాయించింది ప్రభుత్వం. ఇప్పుడు బార్ లైసెన్స్ లో కూడా ప్రాధాన్యత ఇవ్వనుంది. 840 బార్లు ఉండగా కల్లు గీత కార్మికులకు 84 బార్లు ఇచ్చే అవకాశం ఉంది.

Also Read: ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. భారీ వర్షాలు వచ్చేస్తున్నాయ్.. మూడ్రోజులు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు

Exit mobile version