ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. భారీ వర్షాలు వచ్చేస్తున్నాయ్.. మూడ్రోజులు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు

ఏపీలో వచ్చే మూడు నాలుగురోజులు వర్షాలు దంచికొట్టనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. భారీ వర్షాలు వచ్చేస్తున్నాయ్.. మూడ్రోజులు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు

AP Rains

Updated On : August 4, 2025 / 6:51 AM IST

AP Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్. ఏపీలో వచ్చే మూడు నాలుగురోజులు వర్షాలు దంచికొట్టనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని కారణంగా రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలుప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇవాళ (సోమవారం) అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది.

రేపు (మంగళవారం) పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, ఏలూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల సమయంలో ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

బుధవారం పల్నాడు, అనంతపురం, తిరుపతి, కడప, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

భారీ వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వర్షం పడే సమయంలో బహిరంగ ప్రదేశాలలో ఉండవద్దని.. పాతబడిన భవనాలు, చెట్ల కింద నిల్చోవద్దని సూచించింది. అలాగే ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, కల్వర్టుల సమీపంలో ఉండవద్దని సూచించింది.