ఈ విషయంపై జగన్ ఏనాడూ నోరు మెదపలేదు: నిమ్మల రామానాయుడు

ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

Minister Nimmala ramanaidu

ఆడపిల్లలను రక్షించుకుందాం, భ్రూణ హత్యలు నిర్మూలిద్దాం, మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలను అరికడదామనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాలకొల్లులో డిసెంబర్ 15న సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో 2 కే రన్ నిర్వహిస్తామని చెప్పారు.

“ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద. ఆ సంపదను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కలసి రావాలి. గత ఐదేళ్ల జగన్ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారు.

ఆడపిల్లలకు మేనమామ అంటూ రాష్ట్రంలో వేల మంది అపహరణకు గురవుతున్నా జగన్ ఏనాడూ నోరు మెదపలేదు. ఇంటికి పెద్దన్న అవుతానంటూనే సొంత తల్లి, చెల్లెళ్లకే న్యాయం చేయకుండా, వారిపై పేటీఎం కూలీలతో సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో లేనిపోని నిందలు మోపిన దుర్మార్గుడు జగన్.

ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల ను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ దుర్మార్గ పాలనలో ఇబ్బంది పడ్డ మహిళలందరికీ పెద్దన్నలా చంద్రబాబు అండగా ఉండి న్యాయం చేస్తున్నారు” అని నిమ్మల రామానాయుడు తెలిపారు.

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అందుకే బీఆర్ఎస్‌ దూరంగా ఉంటుంది: ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి