తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అందుకే బీఆర్ఎస్‌ దూరంగా ఉంటుంది: ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ మొదలు పెట్టిన ప్రాజెక్టులను ప్రారంభించడం తప్ప నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ సర్కార్ చేసింది ఏమీ లేదని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అందుకే బీఆర్ఎస్‌ దూరంగా ఉంటుంది: ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి

Jagadish Reddy

Updated On : December 8, 2024 / 2:40 PM IST

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరించేది తెలంగాణ తల్లి కాదని, కాంగ్రెస్ తల్లి అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి అన్నారు. అందువల్ల తమ పార్టీ ఆ కార్యక్రమానికి దూరంగా ఉంటుందని తెలిపారు.

నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ మొదలు పెట్టిన ప్రాజెక్టులను ప్రారంభించడం తప్ప నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ సర్కార్ చేసింది ఏమీ లేదని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.

నిన్నటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వల్ల జిల్లా ప్రజలకు ఒరిగిందేమి లేదని.. బ్రహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, నల్గొండ మెడికల్ కళాశాల అన్నీ నాటి ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే పూర్తయ్యాయని తెలిపారు.

కాగా, తెలంగాణ సచివాలయంలో రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని ఇప్పటికే గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కాంగ్రెస్‌ సర్కారు ఆహ్వానించింది.

Pawan Kalyan : 10వ తరగతి పిల్లల సైన్స్ ఎక్సపరిమెంట్.. వారిని అభినందిస్తూ పవన్ పోస్ట్..