Niti Ayog Report : ఆరోగ్య రంగంలో 3వ స్థానంలో తెలంగాణ, 4వ స్థానంలో AP
ఆరోగ్య రంగంలో తెలంగాణ. మూడవ స్థానంలోను..AP నాలుగో స్థానంలో నిలిచాయన నీతి అయోగ్ రిపోర్టు వెల్లడించింది.

Niti Ayog Report 2019 20
Niti ayog report 2019-20 : తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది. ఆరోగ్యం రంగం పనితీరులో మూడవ స్థానంలో నిలిచింది. నాలుగవ స్థానంలో ఏపీ నిలిచింది. నీతి ఆయోగ్ (నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా) విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానంలో తెలుగు రాష్ట్రాలు మంచి మెరుగైనస్థానాల్లో నిలిచాయి.2018-19 సంవత్సరాలల్లో నీతి అయోగ్ జాబితాలో తెలంగాణ 4వ స్థానంలో నిలవగా, 2019-20 ఏడాదిలో మూడో స్థానానికి చేరింది. అంటే తన స్థానాన్ని గతం కంటే మెరుగుపరుచుకుని మరో స్థానానికి ఎగబాకింది.
రాష్ట్రాల వైద్య పురోగతిపై 2019-20 ఏడాదికి సంబంధించిన 4వ హెల్త్ ఇండెక్స్ రిపోర్టును నీతి ఆయోగ్ సోమవారం విడుదల చేసింది.నీతి అయోగ్ రిపోర్టులో కేరళ టాప్-1 స్థానంలో నిలిచింది.అలాగే తమిళనాడు రెండో స్థానంలో,నాలుగవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. వైద్య వసతుల్లో వరుసగా 4వ సారి కేరళ అగ్రస్థానంలో నిలవటం గమనించాల్సిన విషయం.
అలాగు పెద్ద రాష్ట్రాలు మాత్ర ఆరోగ్య రంగం పనితీరులు వెనుకబడినట్టుగా నీతి అయోగ్ వెల్లడించింది. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఆఖరి స్థానంలో నిలవటం అత్యంత గమనించాల్సిన విషయం. చిన్న రాష్ట్రాల జాబితాలో మిజోరం చక్కటి స్థానాన్ని పొందింది. కేంద్ర పాలిత ప్రాంతాల విభాగంలో ఢిల్లీ, జమ్మూకశ్మీర్ ముందున్నాయి. ప్రోత్సాహక నమోదు రాష్ట్రాల్లో యూపీ అగ్రభాగాన నిలిచింది.