Nitin Gadkari : అభివృద్ధి విషయంలో కేంద్రం ఎవ‌రిపైనా వివ‌క్ష చూపదు-నితిన్ గడ్కరీ

అభివృద్ధి విషయంలో కేంద్రం ఎవరిపైనా వివక్ష చూపించదని... అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

Nitin Gadkari

Nitin Gadkari : అభివృద్ధి విషయంలో కేంద్రం ఎవరిపైనా వివక్ష చూపించదని… అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని ఆయన అన్నారు. ఏపీలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఎంతో కీలకమైనవి అన్న ఆయన… వ్యవసాయ రంగంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో పోర్టులది కీలక పాత్ర అని చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ.. 30 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఇవాళ మర్చిపోలేని రోజని అన్నారు.

”ఏపీలో రోడ్ల అభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు కేటాయిస్తాం. ఏపీలో 3 గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నాం. 2024లోగా రాయ్‌పూర్‌-విశాఖ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే అందుబాటులోకి తెస్తాం. నాగ్‌పూర్‌-విజయవాడ, బెంగళూరు-చెన్నై మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలు నిర్మిస్తాం. రూ.5వేల కోట్లతో చిత్తూరు-తంజావూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేని పూర్తి చేస్తాం’’ అని గడ్కరీ వెల్లడించారు.

CM Jagan : రాష్ట్ర చరిత్రలో ఈరోజు మైలురాయి.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్

”రోడ్లు బాగుంటే రవాణ వ్యయం భారీగా తగ్గుతుంది. చైనాతో పోల్చితే భారత్‌లో రవాణ వ్యయం చాలా ఎక్కువ. త్వరలో డీజిల్‌ లారీలకు బదులు ఎలక్ట్రిక్‌ లారీలు, డీజిల్‌ స్థానంలో సీఎన్‌జీ, ఎల్‌పీజీ రవాణ వాహనాలు రానున్నాయి. పోలవరం పూర్తయిన తర్వాత వ్యక్తిగతంగా వస్తా. నేను జలవనరుల మంత్రి కాదు.. అయినా పోలవరం చూస్తా’ అని నితిన్ గడ్కరీ చెప్పారు.

‘ఎంతో మంది నైపుణం ఉన్న యువత ఏపీలో ఉన్నారు. ఇథనాల్‌ ఉత్పత్తికి ఏపీ కేంద్రం కావాలి. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం బాగా తగ్గాలి. గ్రీన్‌ హైడ్రోజన్‌ వాడకం పెరిగితే పర్యావరణానికి ఎంతో మేలు. దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారం. సీఎం జగన్‌ ఇచ్చిన ఈస్ట్రన్‌ రింగ్‌ రోడ్డుకు ఇప్పుడే ఆమోదం తెలుపుతున్నా. పరిశ్రమలతోనే ఉపాధి సాధ్యం. కేంద్రం నిర్వహిస్తున్న గ్రామ సడక్‌ యోజన ఇప్పుడు అత్యంత కీలకం’ అని నితిన్ గడ్కరీ తెలిపారు.

నితిన్‌ గడ్కరీతో కలిసి గురువారం విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు. 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూమిపూజ చేశారు.

Nitin Gadkari : ఏపీలో భారీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ.. షెడ్యూల్ ఇదే..!

అన్నారు. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు జగన్. రాష్ట్రంలో 51 ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, కిషన్‌రెడ్డిలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు సీఎం జగన్.

బెంజ్ స‌ర్కిల్ ప్లైఓవ‌ర్-2 ప్రారంభోత్స‌వం జ‌రిగింది. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, సీఎం జగన్ ప్రారంభించారు. మొత్తం ప్రాజెక్టులకు రూ.20వేల కోట్ల ఖర్చు అయ్యింది. ఫ్లైఓవర్‌ ప్రారంభంతో బెంజ్‌ సర్కిల్‌ దగ్గర ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి.