AP Telangana Water War
AP Telangana Water War: వాటర్ వార్.. తెలుగు స్టేట్స్ మధ్య ఉండే రెగ్యులర్ పంచాయితీ ఇది. ఈ మధ్య గులాబీ బాస్ కేసీఆర్ కామెంట్స్‌తో మళ్లీ రచ్చ అయింది. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ కామెంట్స్..హరీశ్ కౌంటర్‌తో తెలంగాణలో రాజుకున్న నీళ్ల మంటలు ఏపీకి వ్యాపించాయి. అటు ఏపీలో నాలుగైదు రోజులు వార్ వార్ ట్రెండింగ్ అయింది. ఈ గట్టున మొదలైన పంచాయితీ..ఆ గట్టుకు హీటెక్కించింది.
Also Read : Sankranti Rush : సంక్రాంతి ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్.. డైవర్షన్స్ చూసుకోండి..
ఏపీలో టీడీపీ, వైసీపీ వాటర్ వార్ పేరుతో డైలాగ్‌వార్‌కు దిగి మైలేజ్ కోసం ఎత్తుకు పైఎత్తులు వేశాయి. రేవంత్ వ్యాఖ్యలను బేస్ చేసుకుని చంద్రబాబుపై వైసీపీ అటాక్ చేస్తే..హరీశ్‌రావు కామెంట్స్ ఆధారంగా..వైసీపీపై టీడీపీ విమర్శల దాడి చేసింది. మీ హయాంలో అన్యాయం జరిగిందంటే..మీ హయాంలో అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఆ రచ్చ..రాద్దాంతం అలా కొద్దిగా చల్లబడిందో లేదో..ఇటు ఏపీ సీఎం..అటు తెలంగాణ సీఎం ఇద్దరు..ఒకే రోజు ఒకే రకమైన స్టేట్‌మెంట్స్ ఇచ్చి చర్చకు దారితీశారు.
గొడవలు కాదు తెలుగు జాతి ప్రయోజనాలు ముఖ్యం..
ఇద్దరు సీఎంలు ఒకే వాయిస్ వినిపించడం ఆసక్తికరంగా మారింది. పంచాయితీలు కంటే పరిష్కారం ముఖ్యమన్న తెలంగాణ సీఎం రేవంత్..తెలంగాణాకు నీళ్ళే కావాలని..వివాదాలు వద్దు అన్నారు. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలని భావించడం లేదన్న రేవంత్..చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని చెప్పుకొచ్చారు. అటు సీఎం చంద్రబాబు కూడా ఇదే అర్థం వచ్చేలా మాట్లాడారు. సముద్రంలోకి వెళ్లే నీళ్ల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య గొడవలు ఎందుకు అని ప్రశ్నించారు. నీళ్లు వద్దు గొడవలే కావాలని కొందరు బయల్దేరారని సెటైర్లు వేసిన బాబు..గొడవలు కాదు తెలుగు జాతి ప్రయోజనాలు ముఖ్యమంటూ స్పష్టం చేశారు.
రాయలసీమ రతనాల సీమ కావాలన్న కేసీఆర్..
అయితే ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నోట ఒకే మాట రావడం ఒక రకంగా పాజిటివ్ ఇండికేషనే. వాస్తవానికి నీటి పంచాయితీ ఇప్పటిది కాదు. ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో తెలియదు. బేసిన్లు లేవు భేషజాలు లేవంటూ..మాజీ సీఎం కేసీఆర్ అప్పట్లో ఏపీ సీఎం జగన్‌తో సమావేశం తర్వాత స్టేట్‌మెంట్ ఇచ్చారు. రాయలసీమ రతనాల సీమ కావాలంటూ కూడా చెప్పుకొచ్చారు. అప్పటి సీఎంల భేటీ..నీళ్ల వివాదాన్ని కొలిక్కి తెచ్చిందో లేదో..వారి చర్చలు సఫలం అయ్యాయో, విఫలం అయ్యాయో ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ నీళ్ల లొల్లి మాత్రం..ఎప్పటికప్పుడు సరికొత్త టర్న్ తీసుకుంటుంది.
నదీ జలాలపై వివాదం పరిష్కారం అవుతుందా?
అయితే చంద్రబాబు, రేవంత్ మధ్య సాన్నిహిత్యంతో..కృష్ణా, గోదావరి నదీ జలాలపై వివాదం పరిష్కారం అవుతుందా అన్న చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్రతో ఇద్దరు సీఎంలు సామరస్య పూర్వక వాతావరణంలో జల జగడాలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. 2024 జూలై నెలలో ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ జరిగింది. ఆ సమావేశంలో విభజన అంశాలు, షెడ్యూల్ 9లోని వివాదాలపై డిస్కస్ చేశారు. ఉద్యోగులు, ఆస్తుల విభజన అంటూ కొద్ది రోజులు హడావుడి నడిచింది. ఫైనల్ ఔట్ పుట్ ఏంటో ఇప్పటికీ స్పష్టత లేదు.
అయితే ఇప్పుడు నీటి వాటాల విషయంలో ఇద్దరు సీఎంలు ఒకే తీరుగా స్పందించడం మాత్రం కాస్త సానుకూలమైన అంశం. ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలకు జీవ నదులు అయిన కృష్ణా, గోదావరి జలాలపై వివాదాల కంటే పరిష్కారాలే ముఖ్యమని బాబు, రేవంత్ కోరుకోవడం అయితే..ఆహ్వానించదగ్గ విషయమే. కాకపోతే వాటర్ వార్‌పై కూర్చొని మాట్లాడుకుని సమస్యను సాల్వ్ చేస్తారా? వాటర్ ఇష్యూ ఎప్పటికప్పుడు రాజకీయ అంశంగానే ఉండిపోతుందా అనేదే చూడాలి.