Palnadu : మర్డర్ కేసులో సంచలన విషయాలు.. జువెల్లర్స్‌ నుంచి కల్వర్టు వరకు ఏం జరిగింది ?

జువెల్లర్స్‌ నుంచి కల్వర్టు వరకు ఏం జరిగింది..? చంపేసి అక్కడ మృతదేహాన్ని పడేశారా..? లేక కల్వర్టు కిందనే కొట్టి చంపేశారా..? ఈ మధ్యలో పెనుగులాట జరిగిందా..?...

Palnadu : మర్డర్ కేసులో సంచలన విషయాలు.. జువెల్లర్స్‌ నుంచి కల్వర్టు వరకు ఏం జరిగింది ?

Palnadu

Updated On : April 23, 2022 / 1:06 PM IST

Palnadu Murder Case In Narasaraopet : పల్నాడు మర్డర్‌ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రామాంజనేయులు మర్డర్‌కి గజదొంగ రాయపాటి వెంకన్న కేసుకు సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. కేరళలో దొంగతనాలు చేయడంలో దిట్ట అయిన రాయపాటి వెంకన్న.. భారీగా బంగారం చోరీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతను చోరీ చేసిన బంగారం కోసం అనుచరులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే అతని ప్రధాన అనుచరులు చంటి కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయాడు.

Read More : Kidnap Murder : కిడ్నాప్‌కు గురైన జ్యూయలరీ షాపు ఉద్యోగి హత్య

అప్పటి నుంచి రామాంజనేయులు మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చంటి కనిపించకపోవడం వెనక రామాంజనేయులు హస్తం ఉందని చంటి సోదరుడు బాజీ అనుమానిస్తున్నాడు. ఈ విషయంపై పలుమార్లు రామాంజనేయులుని నిలదీశాడు కూడా. కొద్ది రోజులుగా చంటి ఆచూకీ గురించి రామాంజనేయులును ప్రశ్నిస్తున్నాడు బాజి. అన్నవరపు కిశోర్‌ కూడా ఫోన్లు చేసి వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. జువెల్లర్స్‌ నుంచి అతన్ని తీసుకెళ్లిన నిందితులు.. తీవ్రంగా కొట్టి చంపారు. మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి తుమ్మలపల్లి కల్వర్టు కింద పడేశారు.

Read More : Bride Cheating : పెళ్లికి మూడు రోజలు ముందు డబ్బు తీసుకుని వధువు పరార్

సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారు ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని కనుగొన్నారు. అయితే జువెల్లర్స్‌ నుంచి కల్వర్టు వరకు ఏం జరిగింది..? చంపేసి అక్కడ మృతదేహాన్ని పడేశారా..? లేక కల్వర్టు కిందనే కొట్టి చంపేశారా..? ఈ మధ్యలో పెనుగులాట జరిగిందా..? హత్యకు ఏ ఆయుధాలు వినియోగించారు..? అన్నవరపు కిశోర్‌, బాజీ రాత్రి పోలీస్‌స్టేషన్‌కి వచ్చినట్టు మృతుడి భార్య చెబుతోంది.. మరి హత్య ఎప్పుడు జరిగింది..? ఎవరు చేశారు..? ఇంకా అనేక ప్రశ్నలు ఈ మర్డర్‌ చుట్టూ తిరుగుతున్నాయి. ముందు కల్వర్టు కింద గోనెసంచిలో మృతదేహం ఉందన్న వార్త కలకలం రేగింది. మృతదేహం రామాంజనేయులుదా.. కాదా అని గుర్తించేందుకు అతని భార్యను అక్కడికి తీసుకెళ్లారు పోలీసులు. విగతజీవిగా ఉన్న భర్తను చూసి కళ్లు తిరిగి పడిపోయింది మృతుడి భార్య ప్రసన్నలక్ష్మి. ఇది ముమ్మాటికీ అన్నవరపు కిశోర్‌, బాజీలే చేశారని చెబుతోంది. అయితే హత్య వెనక కారణాలను మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతోంది.