Bride Cheating : పెళ్లికి మూడు రోజలు ముందు డబ్బు తీసుకుని వధువు పరార్

యస్సు మీరిన పెళ్లి కొడుకులకు పెళ్లిళ్లు కావటం కష్టంగా మారిన ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అలాగే మోసం చేస్తున్నారు. మరో మూడు రోజులలో పెళ్లి ఉందనగా పెళ్లి కూతురు అత్తింటి వారికి మత్తు మందు కలిపిన టీ ఇచ్చి ఇంట్లోనినగదు తీసుకని పరారైన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Bride Cheating : పెళ్లికి మూడు రోజలు ముందు డబ్బు తీసుకుని వధువు పరార్

Mp Bride Escape

Bride Cheating :  వయస్సు మీరిన పెళ్లి కొడుకులకు పెళ్లిళ్లు కావటం కష్టంగా మారిన ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అలాగే మోసం చేస్తున్నారు. మరో మూడు రోజులలో పెళ్లి ఉందనగా పెళ్లి కూతురు అత్తింటి వారికి మత్తు మందు కలిపిన టీ ఇచ్చి ఇంట్లోనినగదు తీసుకని పరారైన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

మధ్య ప్రదేశ్ లోని మందసౌర్ ప్రాంతంలో నివసించే  ఒక కుటుంబంలోని వ్యక్తికి వయస్సు పెరిగిపోతున్నా వివాహం కాలేదు.  దీంతో ఆఇంట్లోని పెద్దలు  రత్లాంకు చెందిన   మంగళ అనే పెళ్లిళ్లి బ్రోకర్ కు  రెండు లక్షల రూపాయలు ఇచ్చి సంబంధం కుదర్చమన్నారు.  మంగళ హోషంగాబాద్, నర్మాదాపూర్ లో నివసించే ఆర్తిబింద్ అనే యువతితో పెళ్లి ఖాయం చేసింది.

ఆర్య సమాజ్ లో పెళ్ళి చేయటానికి ఇరువైపులా నిర్ణయించుకున్నారు.  పూజ, అర్జున్ ప్రజాపతి అనే ఇద్దరితో కలిసి ఆర్తిబింద్ అత్తవారింటికి వచ్చింది. ఈనెల 21 ఇంట్లోని మగవారంతా షాపింగ్ కు బయటకు వెళ్ళారు. ఇంట్లో ఉన్న ఆర్తి బింద్ టీలో మత్తు మందు కలిపి  కాబోయే అత్తగారికి, ఆడపడుచుకు ఇచ్చింది. వారిద్దరూ స్పృహ తప్పి పడిపోగానే ఆర్తిబింద్ ఆమెతో పాటు ఉన్న ఇద్దరు …. ఇంట్లోని లక్ష రూపాయలు నగదు తీసుకుని పరారయ్యారు.
Also Read : Kidnap Murder : కిడ్నాప్‌కు గురైన జ్యూయలరీ షాపు ఉద్యోగి హత్య
ఇంటికి తిరిగి వచ్చిన మగవారు పరిస్ధితి గమనించి మహిళలు ఇద్దరిని ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  మహిళల పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పెళ్ళి కుదిర్చిన బ్రోకర్ తో సహా నలుగురిపై పోలీసులు  ఐపీసీ సెక్షన్ 420, 406,380, 328 ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు.