YCP MP Candidates List
YCP MP Candidates List : ఏపీలో అధికార పార్టీ వైసీపీ లోక్ సభ ఎన్నికల కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థుల జాబితా మార్పులు, చేర్పులపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సీఎం జగన్ ఎంపీ అభ్యర్థుల విషయంలోనూ అతే పంథాను అనుసరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కీలకం కావాలంటే ఎంపీ సీట్లు ఎక్కువగా గెలుచుకునే వ్యూహంతో ముందుకెళ్తున్నారు.
గత ఎన్నికల్లో 22మంది ఎంపీలు గెలిచినా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ రావడంతో వైసీపీ అవసరం బీజేపీకి రాలేదు. కానీ, వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకి నార్త్ లో సీట్లు తగ్గితే కచ్చితంగా ఏ పార్టీ అయినా వైసీపీ మద్దతు తీసుకునే అవకాశం ఉండటంతో ప్రత్యేకంగా లోక్ సభ అభ్యర్థులపై ఫోకస్ పెట్టింది వైసీపీ అధినాయకత్వం. సిట్టింగ్గుల్లో కొందరిని ఎమ్మెల్యేలుగా పంపిన పార్టీ, మరికొందరిని తప్పించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు అభ్యర్థి కానున్నారు? అనేది హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఎంపీ అభ్యర్థులుగా ఎవరు ఉండే అవకాశం ఉందనే దానిపై 10టీవీ ఎక్స్ క్లూజివ్ రిపోర్టు.
వైసీపీ ఎంపీ అభ్యర్థులుగా వీరు ఉండే అవకాశం..
1. శ్రీకాకుళం – దువ్వాడ శ్రీనివాస్, 2019 అభ్యర్థి. ప్రస్తుతం పరిశీలనలో ఉన్నవారు ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, దానేటి శ్రీధర్, కిల్లి కృపారాణి, పిరియా విజయ
(ఈ సీటులో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న స్థానం. 2009లో కేంద్ర మాజీ మంత్రి కృపారాణి ఓసారి గెలిచారు, వైసీపీ ఇంతవరకు గెలవలేదు)
2. విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్, సిట్టింగ్ ఎంపీ – ప్రస్తుతం పరిశీలనలో మజ్జి శ్రీనివాసరావు, బొత్స సత్యానారాయణ
(విజయనగరంలో బొత్స హవా మొదలయ్యాక 2014లో మాత్రమే టీడీపీ గెలిచింది. 1999 నుంచి ఇప్పటివరకు బొత్స ఆధిపత్యమే నడుస్తోంది. 1999లో బొత్స, 2006 ఉప ఎన్నికల్లో ఝాన్సీలక్ష్మి, 2009లో మళ్లీ బొత్స ఝాన్సీలక్ష్మి గెలిచారు. 2014లో అశోక్‌గజపతిరాజు, 2019లో బెల్లాన చంద్రశేఖర్ అనూహ్యంగా విజయం సాధించారు)
Also Read : గుంటూరులో ఎన్నికల వేడి.. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా?
3. విశాఖపట్నం – ఎంపీవీ సత్యనారాయణ సిట్టింగ్ ఎంపీ – ప్రస్తుతం పరిశీలనలో బొత్స ఝాన్సీలక్ష్మి,
(విశాఖపట్నంలో టీడీపీ హవా ఎక్కువగా ఉంటుంది. కానీ 2004, 2009లో కాంగ్రెస్ గెలిచింది. 2014లో బీజేపీ, 2019లో వైసీపీ గెలిచాయి, ఎక్కువగా చదువుకున్నవారు, ఉద్యోగులు ఓట్లు ఉండటం వల్ల ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతుంటుంది)
4. అరకు – గొడ్డేటి మాధవి, సిట్టింగ్ ఎంపీ.. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఖరారు
2009లో కొత్తగా ఏర్పడిన అరకు నియోజకవర్గంలో మొదట వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ గెలిచారు. 2014లో కొత్తపల్లి గీత (వైసీపీ), 2019లో గొడ్డేటి మాధవి (వైసీపీ) గెలిచారు. మాధవి ప్రస్తుతం అరకు ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఖరారైన భాగ్యలక్ష్మి పాడేరు ఎమ్మెల్యే.. ఈమె భర్త డాక్టర్ నరసింగరావు వైద్యుడిగా గుర్తింపు ఉండటంతో ఎంపీగా పంపుతోంది వైసీపీ.
5. అనకాపల్లి – బీవీ సత్యవతి, సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుతం పరిశీలనలో కరణం ధర్మశ్రీ
(చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేరు పరిశీలిస్తోంది. ఈ స్థానంలో గత ఎన్నికల్లో మాత్రమే వైసీపీ గెలిచింది. 1999 నుంచి ఐదుసార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ మూడుసార్లు గెలిచింది. కాంగ్రెస్ ఒకసారి, వైసీపీ ఒకసారి మాత్రమే గెలిచాయి.
Also Read : పెనుకొండలో ఇద్దరు మహిళల మధ్య ఆసక్తికర పోరు.. గెలిచేదెవరు?
6. కాకినాడ – వంగా గీత సిట్టింగ్ ఎంపీ, పరిశీలనలో చలమలశెట్టి సునీల్
కాకినాడు ఎంపీ గీతను పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి మార్చారు. కాపుల ఓట్లు ఎక్కువగా ఉండటం వల్ల చలమలశెట్టి సునీల్ పేరు పరిశీలిస్తున్నారు.
7. అమలాపురం – చింతా అనురాధ, సిట్టింగ్ ఎంపీ, పరిశీలనలో ఎలీజా
8. రాజమండ్రి – మార్గాని భరత్, సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో డాక్టర్ అనుసూరి పద్మలత(శెట్టిబలిజ సామాజికవర్గం)
9. నరసాపురం – రఘురామకృష్ణంరాజు, సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో గోకరాజు గంగరాజు, శ్రీరంగనాథరాజు(ఆచంట ఎమ్మెల్యే), శ్యామలా దేవి(కృష్ణంరాజు భార్య)
10. ఏలూరు – కోటగిరి శ్రీధర్, సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో ఆళ్ల నాని, కొట్టు సత్యనారాయణ(మంత్రి), అరసవిల్లి అరవింద్(వ్యాపారవేత్త), వివి వినాయక్(డైరెక్టర్)
11. మచిలీపట్నం – వల్లభనేని బాలశౌరి సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో డైరెక్టర్ వివి వినాయక్
12. విజయవాడ – పీవీపీ, 2019 అభ్యర్థి.. పరిశీలనలో అక్కినేని నాగార్జున, వసంత కృష్ణప్రసాద్(మైలవరం ఎమ్మెల్యే)
13. గుంటూరు – మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, 2019 అభ్యర్థి.. పరిశీలనలో లావు శ్రీకృష్ణదేవరాయులు(నరసరావు పేట ఎంపీ)
14. నరసారావుపేట – లావు శ్రీకృష్ణదేవరాయులు సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి
15. బాపట్ల ఎస్‌సీ – నందిగం సురేశ్, సిట్టింగ్ ఎంపీ.. కొనసాగించే అవకాశం
16 ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు, సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో వై.విక్రాంత్‌రెడ్డి(వైవీ సుబ్బారెడ్డి కుమారుడు), మద్దిశెట్టి వేణుగోపాల్(దర్శి ఎమ్మెల్యే)
17. నంద్యాల – పోచా బ్రహ్మానందరెడ్డి, సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో అలీ, సినీ నటుడు
18. కర్నూలు – సంజీవ్‌కుమార్, సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో గుమ్మనూరి జయరాం(మంత్రి)
19. అనంతపురం – తలారి రంగయ్య, సిట్టింగ్ ఎంపీ.. శంకరనారాయణ (ఖరారైన అభ్యర్థి-మాజీ మంత్రి, పెనుగొండ సిట్టింగ్ ఎమ్మెల్యే)
20. హిందూపురం – గోరంట్ల మాధవ్, సిట్టింగ్ ఎంపీ.. జె.శాంతమ్మ (ఖరారైన అభ్యర్థి)
21. కడప – వైఎస్ అవినాశ్‌రెడ్డి.. మార్పు ఉండే అవకాశం లేదు..
22. నెల్లూరు – ఆదాల ప్రభాకర్‌రెడ్డి సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(రాజ్యసభ సభ్యుడు)
23. తిరుపతి – డాక్టర్ గురుమూర్తి సిట్టింగ్ ఎంపీ, కొనసాగించే అవకాశం
24. రాజంపేట – మిథున్‌రెడ్డి, సిట్టింగ్ ఎంపీ.
25. చిత్తూరు – ఎస్.రెడ్డప్ప, సిట్టింగ్ ఎంపీ(కొనసాగించే అవకాశం, మంత్రి పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడు)