×
Ad

Nara Lokesh: అలాంటి వారికే గుర్తింపు అంటున్న నారా లోకేశ్

యంగ్ లీడర్లకు పార్టీ పదవుల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తే.. మరో 25, 30 ఏళ్ల వరకు టీడీపీకి బలమైన పునాదులు వేసినట్లు అవుతుందని భావిస్తున్నారట.

Nara Lokesh (Image Credit To Original Source)

  • పార్టీ ఫస్ట్..తర్వాతే ఎవరైనా.. లోకేశ్‌ క్లియర్‌ కట్‌..!
  • పార్టీ శాశ్వతం, ప్రభుత్వం తాత్కాలికం అంటున్న యువనేత
  • అధికారంలో ఉన్నాం.. అలకలు అసలే వద్దని సూచన

Nara Lokesh: అతిపెద్ద ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీల హవా నడిచిన రోజుల్లో రీజనల్‌ ఫోర్స్‌గా వచ్చి నిలబడిన బలమైన నాయకత్వం టీడీపీ సొంతం. అలాంటి తెలుగు దేశం పార్టీ రాష్ట్రాన్ని మరో 30 ఏళ్లు పాలిస్తామని..భవిష్యత్‌ అంతా యువతే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకు అవసరమైన శక్తిని కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ఏ పార్టీ అయినా పది కాలాలు పనిచేయాలంటే సమర్థ నాయకత్వం అత్యంత అవసరం. ప్రస్తుతం చంద్రబాబు రూపంలో టీడీపీకి సమర్థవంతమైన నాయకత్వం ఉంది. 43 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో 30 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లు వచ్చినా పార్టీని నడిపిస్తూ వస్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని యువతకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.

ఇటు యువతరం, అటు సీనియర్ నేతలను కోఆర్డినేట్ చేస్తూ..35 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉన్న నేతలకు ఎక్కువ అవకాశాలు ఇస్తోంది టీడీపీ హైకమాండ్. రాష్ట్ర కమిటీలు, జిల్లా కార్యవర్గంలోనూ యువతకే ప్రయారిటీ ఇవ్వడం వెనుక ఫ్యూచర్ ప్లాన్ ఉందన్న చర్చ జరుగుతోంది.

Also Read: అజిత్ పవార్ విమాన ప్రమాదం: మేడే కాల్‌ రాలేదు.. రన్‌వే కనిపించడంలో పైలట్లకు ఇబ్బందులు.. డీజీసీఏ ఏం చెప్పింది?

టీడీపీకి కొత్త రూపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట లోకేశ్. యువతకు, మహిళలకు పెద్ద పీట వేస్తామని చెబుతున్నారు. టీడీపీలో యువత ముద్ర గట్టిగా ఉండాలని యూత్ బ్రాండ్‌తో దూసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నారు. 43 ఏళ్ల టీడీపీ పార్టీలో..కీలక నాయకులు, అనుభవం ఉన్న లీడర్లంతా ఆరు పదుల వయసు దాటినవారే. అందుకే లోకేష్ యువ నామస్మరణ చేస్తున్నారట.

యువతను పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తారా?
పార్టీ పార్లమెంటరీ కమిటీ ప్రతినిధుల వర్క్ షాప్‌లో లోకేశ్‌ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. పార్టీలో యువతను పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందన్న ఆయన..సామాజిక న్యాయం, మహిళలకు ప్రాధాన్యతతో మరో పది కాలాల పాటు పార్టీ పటిష్టంగా నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. దాంతో పార్టీలో యంగ్ బ్లడ్ అన్నది ఇప్పుడు లోకేశ్‌ మంత్రంగా మారుతోంది.

పార్టీలో దశాబ్దాల పాటు ఒకే పదవిలో ఒకరు ఉండరాదని లోకేశ్‌ పదేపదే స్పష్టం చేస్తున్నారు. తనతో సహా ఎవరైనా ఏ పదవిని అయినా రెండు సార్లకు మించి చేపట్టొద్దని కఠిన నిబంధనను ఉండాలంటున్నారు. అదే జరిగితే టీడీపీ పొలిట్ బ్యూరోలో యువతకు చోటు దక్కుతుందని లోకేశ్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో వరకు ఎదగాలని బలంగా కోరుకుంటున్నారు లోకేశ్‌.

క్యాడర్ వైపే తాను ఉంటానని పనిచేసే యువతకు పార్టీలో స్థానం దక్కేలా చూస్తామని భరోసా కల్పిస్తున్నారు లోకేశ్‌. ఒక సగటు పార్టీ కార్యకర్త పొలిట్ బ్యూరో మెంబర్ ఎందుకు కాకూడదని లోకేశ్‌ ప్రశ్నిస్తున్నారు. టీడీపీలో కార్యకర్తలే అధినేతలుగా ఉంటారని, పార్టీలో యువతకు తగిన అవకాశాలు దక్కాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

టీడీపీ అనేది ఒక వ్యక్తికి పరిమితమైన పార్టీ కాదని, కార్యకర్తలే నిజమైన అధినేతలని చెబుతూ వస్తున్నారు. పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవారికే బాధ్యతలు ఇచ్చామని, పార్లమెంటరీ కమిటీల్లో 83 శాతం మంది కొత్తవారికి కొత్తగా అవకాశం కల్పించామని లోకేశ్‌ స్పష్టం చేశారు. అలకలు వీడి, ఐక్యంగా పనిచేయాలని క్యాడర్‌, లీడర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అలకలు వహించవద్దని, అలా చేయడం కరోనా కంటే ప్రమాదకరమైన జబ్బుతో సమానమని హెచ్చరించారు.

పదవిని బాధ్యతగా భావించాలని హితవు
అలకలతో ఏపీ ప్రజలు, పార్టీ కార్యకర్తలు నష్టపోతారన్నారు లోకేశ్. పార్టీ అనేది సొంతిల్లు వంటిదని, ప్రభుత్వం కిరాయి ఇల్లు లాంటిదన్న విషయం మర్చిపోవద్దంటున్నారు. పదవిని బాధ్యతగా భావించాలని..తనతో సహా ఎవరైనా పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఒక కార్యకర్తగా పనిచేయాలని డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఇలా లోకేశ్‌ పదేపదే యువత జపం చేయడం వెనక ఫ్యూచర్ ప్లాన్ ఉందట.

టీడీపీలో సీనియర్లు, సబ్జెక్ట్‌ మీద అవగాహన ఉన్న నేతలంతా సీనియర్లే. వీళ్లంతా ప్రజెంట్ పాలిటిక్స్‌కు తగ్గట్లుగా దూకుడు పాలిటిక్స్‌ చేయలేకపోతున్నారట. దీంతో యంగ్ లీడర్లకు పార్టీ పదవుల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తే.. మరో 25, 30 ఏళ్ల వరకు టీడీపీకి బలమైన పునాదులు వేసినట్లు అవుతుందని భావిస్తున్నారట.

భవిష్యత్‌ నాయకత్వం స్ట్రాంగ్‌గా ఉంటే..అధికారం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా పార్టీ యాక్టివిటీ యాజ్‌ టీజ్‌గా నడుచుకుంటూ వెళ్తుందని.. పార్టీ కూడా లాంగ్‌ టర్మ్‌లో నిలబడుతుందనేది లోకేశ్ ఈక్వేషన్‌గా చర్చించుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు.