Pawan Kalyan : రోడ్డు ప్ర‌మాదంలో అభిమానుల మృతి.. ఘ‌ట‌నా స్థలాన్ని ప‌రిశీలించిన ప‌వ‌న్‌..

ప్ర‌మాద స్థ‌లిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిశీలించారు.

Pawan Kalyan Inspect the ADB Road ahead of Development Projects Launches in Pithapuram

ఇటీవ‌ల రాజ‌మండ్రిలో రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రాజ‌మండ్రిలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌కు హాజ‌రై తిరిగి ఇంటికి వెలుతున్న క్ర‌మంలో కాకినాడ జిల్లా గైగోలుపాడు గ్రామానికి చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్‌(22) అనే ఇద్ద‌రు యువ‌కులు రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. రంగంపేట మండ‌లం ముకుంద‌వ‌రం గ్రామం వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. తాజాగా ప్ర‌మాద స్థ‌లిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిశీలించారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ శుక్ర‌వారం పిఠాపురంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న పిఠాపురం వెలుతున్నారు. రంగంపేట ఏడీబీ రోడ్డు మీదుగా వెలుతూ ప్ర‌మాద స్థలిని ప‌రిశీలించారు. ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌ని ఆరా తీశారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం రోడ్డు మ‌ర‌మ్మ‌తు ప‌నుల గురించి ఆరా తీశారు.

Pawan Kalyan: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల భక్తులకు పవన్ కల్యాణ్ కీలక విజ్ఞప్తి

కాగా.. గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. మ‌ణికంఠ‌, చ‌ర‌ణ్ కుటుంబాల‌కు అండ‌గా ఉంటామ‌ని ఇప్ప‌టికే ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించారు. మ‌రోవైపు నిర్మాత దిల్ రాజు సైతం మృతుల కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు.

ఇదిలాఉంటే.. పిఠాపురం నుండే రాష్ట్ర‌వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం ద్వారా రైతుల సబ్సిడీతో నిర్మించిన 12,500 మినీ గోకులాలను పవన్ ప్రారంభించనున్నారు. ఆ త‌రువాత‌ పిఠాపురం పాత బస్టాండు సెంటర్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ లో జరగనున్న సంక్రాంతి సంబరాల్లో ఆయ‌న పాల్గొన‌నున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగిస్తారు.

Pawan Kalyan: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..