Pawan Kalyan: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. అక్కడ జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు.

AP Deputy CM Pawan Kalyan Pithapuram Tour
Pawan Kalyan Pithapuram Tour: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. పిఠాపురం నుండే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం ద్వారా రైతుల సబ్సిడీలో నిర్మించిన 12,500 మినీ గోకులాలను పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. అదేవిధంగా పిఠాపురం పాత బస్టాండు సెంటర్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ లో జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగిస్తారు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి, విధివిధానాలపై పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారు. పవన్ పర్యటనలో భాగంగా హైసెక్యూరిటీ నేపథ్యంలో ప్రత్యేక అధికారులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
Also Read: AP Govt: సంక్రాంతి వేళ గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటుందా
పవన్ పర్యటన సాగేదిలా..
♦ ఉదయం 8.30 గంటకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 9.10కి పవన్ కల్యాణ్ రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
♦ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పిఠాపురం నియోజకవర్గంకు వెళ్తారు.
♦ రాజానగరం, రంగంపేట, పెద్దాపురం రోడ్డు మీదుగా సామర్లకోట నుండి పవన్ పిఠాపురం చేరుకుంటారు.
♦ ఇటీవలే గేమ్ ఛేంజర్ మూవీ ఫ్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, వారు ప్రయాణించిన ప్రాంతంలో రోడ్డు పరిస్థితుల్ని పవన్ పరిశీలించనున్నారు.
♦ 11.45 గంటలకు రోడ్డు మార్గంలో పిఠాపురం మండలం కుమారపురంకు పవన్ కల్యాణ్ చేరుకుంటారు.
♦ కుమారపురంలో ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు సబ్సిడీలో నిర్మించుకున్న మినీ గోకులాన్ని ప్రారంభిస్తారు.
♦ అక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా 12,500 మినీ గోకులాలను పవన్ ప్రారంభిస్తారు.
♦ అనంతరం రోడ్డు మార్గంలో పిఠాపురం చేరుకుంటారు.
♦ రాజీవ్ గాంధీ మునిసిపల్ హైస్కూల్లో ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు.
♦ మొదట వివిధ రకాల స్టాల్స్ ను సందర్శించి.. అనంతరం సంక్రాంతి సంబరాలలో పవన్ పాల్గొంటారు.
♦ హై స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు.
♦ అనంతరం అక్కడనుండి రోడ్డు మార్గంలో చేబ్రోలులో తన నివాసంకు చేరుకుంటారు.
♦ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు.
♦ వీర మహిళలు వేసిన ముగ్గులను పరిశీలిస్తారు.
♦ అనంతరం అక్కడ నుండి రోడ్డు మార్గంలో రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
♦ రాజమండ్రి నుండి విమానంలో మంగళగిరికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్తారు.