AP Govt: సంక్రాంతి వేళ గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటుందా

సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

AP Govt: సంక్రాంతి వేళ గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటుందా

Minister Narayana

Updated On : January 10, 2025 / 9:00 AM IST

AP Govt: సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017,ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ – 2017 లో సవరణలు చేస్తూ వేరువేరుగా జీవోలను ప్రభుత్వం జారీ చేసింది.

Also Read: Nitish Reddy: క్రికెటర్ నితీశ్ రెడ్డికి వైజాగ్‌లో ఘన స్వాగతం.. ఓపెన్‌టాప్‌ జీపులో ఊరేగింపుగా.. వీడియో వైరల్

మంత్రి నారాయణ మాట్లాడుతూ.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా భవన, లే అవుట్ల అనుమతుల్లో మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలో రియ‌ల్ ఎస్టేట్ రంగం పెరిగేలా కీల‌క సంస్క‌ర‌ణ‌లతో తాజా ఉత్తర్వులు జారీ చేశామని, సంక్రాంతి కానుక‌గా బిల్డ‌ర్లు, డెవ‌ల‌ప‌ర్లు, ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా ఉండేలా నిబంధ‌న‌లు మార్పులతో జీవోలు జారీ చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. లే అవుట్లలో రోడ్లకు గ‌తంలో ఉన్న‌12మీటర్లకు బ‌దులు తొమ్మిది మీట‌ర్ల‌కు కుదిస్తూ స‌వ‌ర‌ణ‌ చేయడం జరిగిందని, 500 చ‌.మీ. పైబ‌డిన స్థ‌లాల్లో నిర్మాణాల్లో సెల్లారుకు అనుమ‌తి ఇస్తూ నిర్ణ‌యం తీసుకోవటం జరిగిందని మంత్రి నారాయణ చెప్పారు.

Also Read: Gossip Garage : కూటమి ప్రభుత్వం వచ్చాక మాచర్ల నియోజకవర్గంలో మార్పు కనిపిస్తుందా?

టీడీఆర్ బాండ్ల జారీ క‌మిటీలో రెవెన్యూ, స‌బ్ రిజిస్ట్రార్ లను తొలగించడం జరిగిందని, రాష్ట్ర, జాతీయ ర‌హ‌దారిని ఆనుకుని ఉన్న స్థ‌లాలు డెవ‌ల‌ప్ చేసేందుకు 12 మీటర్లు స‌ర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధ‌న తొల‌గించడం జరిగిందని మంత్రి చెప్పారు. బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల సెట్ బ్యాక్ నిబంధ‌న‌ల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. వీటితోపాటు మరిన్ని నిబంధనలు సరళతరం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ల ప్రతినిధులతో చర్చించి తుది నిబంధనలు జారీ చేశామని, తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.