Gossip Garage : కూటమి ప్రభుత్వం వచ్చాక మాచర్ల నియోజకవర్గంలో మార్పు కనిపిస్తుందా?
పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి కోసం పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో జల్లెడపడుతున్నారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీకి ప్రత్యేక టీములు వెళ్లినా వెంకట్రామిరెడ్డి ఆచూకీ చిక్కడం లేదు.

Gossip Garage : మాచర్ల నియోజకవర్గం.. ఈ పేరు వింటే ఫ్యాక్షన్ గొడవలు.. హింసాత్మక ఘటనలే గుర్తుకువస్తాయి. ఎన్నికలొచ్చినా.. పొలిటికల్ సభలు జరిగినా.. రాద్ధాంతమే ఇక్కడి రాజకీయ సిద్ధాంతం. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక మాచర్ల నియోజకవర్గంలో మార్పు కనిపిస్తుందా.. కొందరి నేతల అరెస్ట్‌ల తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రజాపాలనకు అడుగులు పడ్డాయా..?
మాచర్లలో మారిపోయిన రాజకీయాలు..
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మొన్నటి వరకు పిన్నెల్లి సోదరులదే హవా.. వారి కనుసైగల్లోనే నియోజకవర్గంలో అన్ని వ్యవహారాలు నడిచేవని లోకల్ టాక్. కానీ ఇప్పుడు వైసీపీ అధికారం చేజారిపోయాక మాచర్ల నియోజకవర్గంలో రాజకీయాలు వేగంగా మారిపోయాయని అక్కడి పబ్లిక్ భావిస్తున్నారట.
రాష్ట్రంలోనే సమస్మాత్మక నియోజకవర్గంగా పేరు..
పల్నాడు జిల్లాలో హింసా రాజకీయాలకు మాచర్ల నియోజకవర్గం కేంద్రంగా మారింది. రాష్ట్రంలోనే సమస్మాత్మక నియోజకవర్గంగా పేరు తెచ్చుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్నపై జరిగిన దాడి. ఎన్నికల సమయంలో జరిగిన రచ్చ.. మాచర్ల హింసా రాజకీయానికి సజీవ సాక్ష్యంగా నిలిచాయి.
ఎన్నికల సందర్భంగా మాచర్లలో తీవ్ర హింస..
టీడీపీ వర్సెస్ వైసీపీ క్రెడిట్ వార్ పల్నాడు జిల్లాలో హింసా రాజకీయాలకు దారి తీసింది. రాష్ట్రంలోనే సమస్మాత్మక నియోజకవర్గంగా చెప్పే మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా తీవ్ర హింస చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ ఏజెంట్‌పై నంబూరి శేషగిరిరావుపై.. కారంపూడి సీఐ నారాయణస్వామిపై అల్లరిమూకలు దాడులకు తెగబడ్డాయి. అంతకుముందు టీడీపీ ఆఫీస్‌లు, ఆ పార్టీ లీడర్ల ఇళ్లు లక్ష్యంగా ఎన్నో దాడులు జరిగాయి. వీటిపై అప్పట్లో కేసులు నమోదైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు.
Also Read : తొక్కిసలాట ఘటనపై అనుమానాలు ఉన్నాయి- సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఇక 7 నెలల క్రితం ఏపీలో ప్రభుత్వం ఛేంజ్ అయ్యింది. ఇటు మాచర్లలో 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగిన పిన్నెల్లి అనూహ్యంగా ఓడిపోయారు. దీంతో మాచర్ల నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నిందితుల అరెస్టులు మొదలయ్యాయి. తొలుత అందరూ అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారట. పోలీసులు ముమ్మరంగా వేటాడి పలువురు నిందితుల్ని అరెస్టు చేశారు. ఇలా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి నుంచి తురకా కిశోర్ వరకు ఒక్కొక్కరిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. పిన్నెల్లి బెయిల్ పై బయటకు వచ్చేశారు. కిశోర్ మాత్రం ఇంకా రిమాండ్‌లోనే ఉన్నారు.
మాచర్ల నియోజకవర్గం వరకు ప్రధాన కేసుల్లో ప్రధాన నిందితుల్లో ఒక్కరు తప్ప అంతా అరెస్టు అయినట్లేనని లోకల్‌లో టాక్ వినిపిస్తోంది. పోలింగ్ వేళ జరిగిన దాడిలో పిన్నెల్లి సోదరుడు వెంట్రామిరెడ్డిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. కానీ వెంకట్రామిరెడ్డి ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఏడు నెలలుగా అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిన వెంకట్రామిరెడ్డి కోసం పోలీసులు ముమ్మర వేట కొనసాగిస్తున్నారు.
అధికారంలో ఉండగా, ఎమ్మెల్యే పిన్నెల్లికి వెన్నుదన్నుగా నిలిచిన వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల అనంతరం మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ఇక మే 14న కారంపూడి పట్టణంలో సీఐ నారాయణస్వామిపై దాడి చేసిన కేసు కూడా ప్రధానమైనదే. జూన్ 4వరకు మాచర్లలోనే ఉన్న వెంకట్రామిరెడ్డి ఫలితాలు వెలువడిన గంటల్లోనే అండర్ గ్రౌండ్‌కి వెళ్లిపోయారు.
మాజీ ఎమ్మెల్యే రామక్రిష్ణారెడ్డి అరెస్టు సమయంలోనే వెంకట్రామిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారని చెప్పినా, ఆయన త్రుటిలో తప్పించుకున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత రామక్రిష్ణారెడ్డి కొన్నాళ్లు రిమాండ్‌లో ఉన్నా వెంకట్రామిరెడ్డి బయటకు రాలేదు. ఇక బ్యాలెన్స్ వెంకట్రామిరెడ్డే టాక్ మాచర్ల సర్కిళ్లలో బిగ్ రీసౌండ్ చేస్తోంది.
పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి కోసం పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో జల్లెడపడుతున్నారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీకి ప్రత్యేక టీములు వెళ్లినా వెంకట్రామిరెడ్డి ఆచూకీ చిక్కడం లేదు. పోలీసులు మాత్రం ఏ ఒక్కరిని వదిలిపెట్టమని సవాల్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా మాచర్ల రాజకీయంలో మార్పు కనిపిస్తుందా లేదో చూడాలి.
Also Read : వైసీపీని వెంటాడుతున్న కొత్త సమస్య..! ఆ నియోజకవర్గం జగన్‌కు తలనొప్పిగా మారిందా..?