Gossip Garage : ఆ నియోజకవర్గం జగన్‌కు తలనొప్పిగా మారిందా..? కారణం ఏంటి?
అసలే కేసులతో క్యాడర్ వణికిపోతుంది. ఇలాంటి టైమ్‌లో ఇదే కంటిన్యూ అయితే క్యాడర్ కండువా మార్చడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.

YS JaganMohan Reddy
Gossip Garage : ఆ నియోజకవర్గం వైసీపీ అధినేత జగన్‌కు తలనొప్పిగా మారిందా..? వర్గపోరుతో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా? గ్రూప్ రాజకీయాలతో రచ్చ లేపుతున్న ఆ నియోజకవర్గం ఏంటి? మొన్నటి వరకు సీరియల్ ఎపిసోడ్స్‌ను తలపించిన రాజకీయం ఇప్పుడు ఎటు వైపు టర్న్ తీసుకుంది.
వైసీపీని వెంటాడుతున్న మరో కొత్త ప్రాబ్లమ్..
అసలే అధికారం చేజారిపోయింది. కొందరు నేతలు పార్టీ కండువా మార్చేస్తున్నారు. పార్టీ మెయిన్ లీడర్లు కూడా సైలెంటయ్యారు. ఇంకొందరు కేసుల భయంతో అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. ఇన్నేసి సమస్యలతో సతమతమవుతున్న పార్టీని ఇప్పుడు కొత్త ప్రాబ్లమ్ వెంటాడుతుందట. కొన్ని నియోజకవర్గాల్లో వర్గపోరు పార్టీ అధినేతకు తలనొప్పిగా మారిందని టాక్ వినిపిస్తోంది.
2019లో వైసీపీ కొంపముంచాయని లోకల్ టాక్..
శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు అంతా ఒక ఎత్తైతే.. టెక్కలి పాలిటిక్స్ మరో ఎత్తు. టెక్కలి రాజకీయాలు ఎప్పుడు హాట్‌హాట్‌గానే ఉంటాయి. రాష్ట్ర రాజకీయ చరిత్రలో టెక్కలి స్థానం ఎప్పటికీ చెరిగిపోనిది. స్వర్గీయ ఎన్టీఆర్ టెక్కలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే టెక్కలి వైసీపీలో దశాబ్ధకాలంగా గ్రూప్ రాజకీయాలు భగ్గుమంటున్నాయి.
Also Read : తిరుపతి తొక్కిసలాట ఘటనలో పోలీసుల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
నేతల మధ్య పోరు తప్ప పొసగడం లేదు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేరాడ తిలక్.. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మధ్య గ్రూపు రాజకీయాలు రావణ కష్టాన్ని తలపించేవని, ఈ గ్రూపు రాజకీయాలే 2019లో వైసీపీ కొంపముంచాయని లోకల్ టాక్.

Duvvada Family Issue
ఇవి చాలదన్నట్లు దువ్వాడ శ్రీనివాస్‌పై అతని భార్య దువ్వాడ వాణి సైతం పోరుబాట పట్టారు. ఆమె కూడా కొత్త గ్రూప్‌ని ఏర్పాటు చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో పేరాడ తిలక్‌ను పార్లమెంట్ బరిలో, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని అసెంబ్లీ బరిలో దించింది. కానీ వైసీపీ అధిష్టానం లెక్కలు తారుమారయ్యాయి. ఇక కిల్లి కృపారాణి వైసీపీకి గుడ్‌బై చెప్పేసి కాంగ్రెస్‌కి వెళ్లిపోయారు.
మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా మారిన టెక్కలి వైసీపీ..
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పోరు.. మొన్నటి వరకు సెన్సేషనల్ డైలీ సీరియల్‌గా సాగింది. దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్, దువ్వాడ వాణి మధ్యలో దివ్వెల మాధురి ఎంటరైంది. దీంతో మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా మారిపోయింది టెక్కలి వైసీపీ. దువ్వాడ కుటుంబ వివాదం పార్టీని డ్యామేజ్ చేసిందంటూ భావించిన వైసీపీ అధిష్టానం. టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలను మళ్లీ పేరాడ తిలక్‌కి అప్పగించారు. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో మరోసారి గ్రూప్‌ల మధ్య అగ్గి రాజేసినట్లయ్యిందని పార్టీలో ఇన్నర్ టాక్.
టెక్కలి నియోజకవర్గ ఆఫీస్‌ను తిలక్ ఏర్పాటు చేశారు. తనని సరిగ్గా గౌరవించలేదంటూ దువ్వాడ శ్రీనివాస్ ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. దివ్వల మాధురితో కలిసి సపరేట్‌గా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో తన ఓటమికి.. తిలక్ కారణమని సరిగ్గా సహకరించలేదంటూ ప్రకటించారు దువ్వాడ.
జగన్ జన్మదినోత్సవ వేడుకల్ని సైతం ఇద్దరు నేతలు సెపరేట్‌గా సెలబ్రేట్ చేశారు. ఇద్దరు నేతలు ఎడ మోహం పెడమోహంగా ఉంటున్నారట. అయితే వీరి ఆధిపత్య పోరుతో క్యాడర్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందనే గాసిప్ బిగ్ సౌండ్ చేస్తోంది. ఎక్కడికి వెళ్తే.. ఎవరికి కోపం వస్తుందో అని క్యాడర్ టెన్షన్ పడుతున్నారట.
దమ్ముంటే తెచ్చుకో టికెట్.. అంటూ పోస్ట్..
మరోవైపు తిలక్, దువ్వాడ వర్గపోరులో దివ్వెల మాధురి ఎంటరై సోషల్ మీడియా వేదికగా ఆమె పెడుతున్న పోస్టులు లోకల్‌గా హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుత ఇన్‌చార్జ్ తిలక్ టార్గెట్‌గా సోషల్ మీడియాలో సవాళ్లు విసురుతున్నారు దివ్వెల మాధురి. ”దమ్ముంటే తెచ్చుకో టికెట్.. తెచ్చుకుంటే వదిలేస్తా పాలిటిక్స్” అంటూ మాధురి పెట్టిన పోస్ట్ టెక్కలి వివాదాలకు ఆజ్యం పోసిందని పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్న మాట.
అసలే కేసులతో క్యాడర్ వణికిపోతుంది. ఇలాంటి టైమ్‌లో ధైర్యంగా ఉండాల్సిన నేతలు వర్గపోరుతో రచ్చ చేస్తున్నారు. ఇదే కంటిన్యూ అయితే క్యాడర్ కండువా మార్చడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి టెక్కలి వైసీపీ వర్గపోరును అధిష్టానం సెట్ చేసేందుకు చర్యలు చేపడుతుందా.. లేదంటే లైట్ తీసుకుంటుందా అనేది చూడాలి.
Also Read : తొక్కిసలాట ఘటనపై అనుమానాలు ఉన్నాయి- సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు